- Home
- Entertainment
- ప్రేక్షకులు నా సినిమాలు చూసే స్థాయికి ఎదగలేదు, బన్నీని ఉదాహరణగా చెబుతూ.. సుకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రేక్షకులు నా సినిమాలు చూసే స్థాయికి ఎదగలేదు, బన్నీని ఉదాహరణగా చెబుతూ.. సుకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
సుకుమార్ గతంలో తన చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.తన మేధావి తనాన్ని ప్రదర్శించేందుకు సుకుమార్ సినిమాలు చేస్తున్నారు.. తన ఇంటెలిజెన్స్ ని ఆడియన్స్ పై రుద్దుతున్నారు అనే విమర్శలు ఎదురయ్యాయి.

పుష్ప 2 చిత్రంతో ఇండియా మొత్తం రీసౌండ్ వినిపించే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ సుకుమార్. బాహుబలి తో పాటు, బాలీవుడ్ చిత్రాలకు కూడా షాక్ ఇచ్చేలా పుష్ప 2 చిత్రం 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకులలో టాప్ లీగ్ లోకి చేరిపోయారు. సుకుమార్ తదుపరి చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఉండబోతోంది.
సుకుమార్ గతంలో తన చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే చిత్రం చేశారు. ఆ మూవీ నిరాశపరిచింది. ఆ టైంలో తన మేధావి తనాన్ని ప్రదర్శించేందుకు సుకుమార్ సినిమాలు చేస్తున్నారు.. తన ఇంటెలిజెన్స్ ని ఆడియన్స్ పై రుద్దుతున్నారు అనే విమర్శలు ఎదురయ్యాయి. ఒక సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ.. తన చిత్రాలని చూసే స్థాయికి ఆడియన్స్ ఇంకా ఎదగలేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. దీని గురించి సుకుమార్ కి ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.
నిజంగానే ఆడియన్స్ గురించి అలా అన్నారా అని ప్రశ్నించగా.. ఏమో అన్నానేమో.. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. కానీ ఇప్పుడు చెబుతున్నా ఆడియన్స్ స్థాయికి నేను ఇంకా ఎదగలేదు. కొన్నిసార్లు నా ఆలోచనలని అర్థం అయ్యేలా ప్రజెంట్ చేయలేకపోతున్నా. ఉదాహరణకి ఆర్య చిత్రంలో హీరో అన్నింటినీ బ్రేక్ చేస్తుంటాడు. కానీ ఫైట్ చేయడు. అక్కడ భారీ ఫైట్ కి ఆస్కారం ఉంది. నిర్మాతలు నా చుట్టూ ఉన్నవారంతా అక్కడ ఫైట్ పెట్టమని గొడవచేశారు.
నేను ఒప్పకోలేదు. అక్కడ ఫైట్ ఉండడం ముఖ్యం కాదు. హీరో ఏమైనా చేయగలడు అని చూపించడం ముఖ్యం అని ఆర్గుమెంట్ చేసి నా మాట నెగ్గించుకున్నా. ఆ చిత్రంలో అది వర్కౌట్ అయింది. కొన్ని చిత్రాల్లో అలాంటి కొత్త ఆలోచనలు వర్కౌట్ కాలేదు అని తెలిపారు. ఆర్యతో అలాంటి సన్నివేశాలకు పాలకొల్లు లాంటి మారుమూల థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయి.
అదే విధంగా అన్ని చిత్రాల్లో నా ఆలోచనలు ఆడియన్స్ కి అర్థం అవుతాయి అని అనుకున్నా. అలా జరగలేదు అని సుకుమార్ తెలిపారు. ఆర్య చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత 100 పర్సెంట్ లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నారు.