- Home
- Entertainment
- జాక్వెలిన్‌కు జైలు నుంచే సుఖేష్ మరో లేఖ.. షారుఖ్ జవాన్ చిత్రంలోని సాంగ్ ప్రస్తావన..
జాక్వెలిన్‌కు జైలు నుంచే సుఖేష్ మరో లేఖ.. షారుఖ్ జవాన్ చిత్రంలోని సాంగ్ ప్రస్తావన..
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్.. జాక్వెలిన్‌కు లేఖలు రాస్తూనే ఉన్నాడు.

సుఖేష్ చంద్రశేఖర్.. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుతో వార్తల్లో నిలిచాడు. సుకేష్‌పై నమోదైన ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సుఖేష్, జాక్వెలిన్‌ల మధ్య సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించబడింది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. జాక్వెలిన్‌కు లేఖలు రాస్తూనే ఉన్నాడు. ఈ లేఖల్లో ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈసారి సుఖేష్ తన లేఖలో.. షారుఖ్ ఖాన్, నయనతార నటించిన జవాన్ చిత్రంలోని చలేయా పాట గురించి కూడా ప్రస్తావించాడు.
ఆ పాట విడుదలైన తర్వాత తాను దానికి డ్యాన్స్ చేశానని పేర్కొన్నాడు. ఈ పాటను జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి అంకితం చేస్తున్నట్టుగా.. ఈ పాటను రూపొందించినందుకు కింగ్ ఖాన్, అనిరుధ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇక, జాక్వెలిన్ కోరికను నెరవేర్చేందుకు భారత్‌లో పెట్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు సుఖేష్ ఆ లేఖలో తెలిపాడు. ‘‘నా బృందం అన్నింటిని సమీకరించింది. సెప్టెంబర్ 11వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించి.. 2024 ఆగస్ట్ 11న కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించబడింది. ఇది నీ తదుపరి పుట్టినరోజు నాడే.. బేబీ’’ అని పేర్కొన్నాడు.
‘‘మేము దేశంలో అత్యుత్తమ పశువైద్యులను కలిగి ఉంటాం. అన్ని చికిత్సలు, శస్త్రచికిత్సలు ఉచితంగా అందించబడతాయి.. మీరు కోరుకున్నట్లుగా, నా రాణి కూడా. ఇది నీ ముఖానికి అందమైన చిరునవ్వును తెస్తుందని నేను నిజంగా ఆశిస్తున్నాను. ఈ దశలో నీ చిరునవ్వు, ప్రేమ మాత్రమే నాకు బలాన్ని ఇస్తున్నాయి. బేబీ, యూఎస్‌ఏలో జరిగిన ఇండియన్ పరేడ్‌లో నువ్వు అద్భుతంగా కనిపించావు. అది నన్ను మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేసింది’’ అని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు.
ఇక, సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. జాక్వెలిన్‌కు అతడు ఇప్పటివరకు చాలా లేఖలు రాశాడు. గత నెలలో జాక్వెలిన్ పుట్టిన రజు సందర్భంగా ఆమెపై తన ప్రేమను ప్రకటిస్తూ సుఖేష్ లేఖ రాశాడు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా జాక్వెలిన్‌ను పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.