- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మనసు విప్పి మాట్లాడుకున్న వేద, యష్.. వేదకు మంచి మాటలు చెప్పిన సుహా?
Ennenno Janmala Bandham: మనసు విప్పి మాట్లాడుకున్న వేద, యష్.. వేదకు మంచి మాటలు చెప్పిన సుహా?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేదతో మాట్లాడుతూ హ్యాపీ నా అని అడగగా చాలా హ్యాపీగా ఉంది విలేజ్ లైఫ్ అనడంతో నేను విలేజ్ లైఫ్ గురించి మాట్లాడటం లేదు వేద మన మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను అని అడుగుతాడు. నాతో హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో పెళ్లి నాకు ఒక కొత్త జన్మ అని అంటుంది వేద. నా జీవితం మొత్తం నాశనం అయ్యిందని డిస్టర్బ్ అయిందని మీకు తెలుసు. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి కాదనుకొని వెళ్లిపోయాడు. అన్నింటికీ మించి జీవితంలో తల్లిని కాలేను అన్నావు పిడుగు లాంటి వార్త నన్ను కుప్ప కూల్చేసింది.
కానీ నేను కుమిలీపోలేదు అందరితో ఆగిపోలేదు నాకు నేను దైర్యం చెప్పుకొని నిలబడి గలిగాను. ఎవరైనా అనాధ పిల్లల్ని పెంచుకుందామని అనుకున్నాను కానీ ఆ సమయంలో నా లైఫ్ లోకి ఖుషి వచ్చింది. మీరు నా లైఫ్ లోకి వచ్చారు. ఖుషికి అమ్మగా మీకు భార్యగా నేను చాలా హ్యాపీ అని అంటుంది వేద. అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని పెళ్లి చేసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా అని ప్రశ్నించగా నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు యష్. నా లైఫ్ లోకి హ్యాపీనెస్ వచ్చింది అంటే అది నీవల్లే కానీ నాకు నేనే నచ్చడం లేదు బయట ప్రపంచంతో యుద్ధం చేస్తున్నాను వేద అని బాధతో మాట్లాడుతాడు.
గతంలో జరిగిన జ్ఞాపకాలను నన్ను గుచ్చుతూనే ఉంటాయి ముక్కలైన నా మనసు వెక్కిరిస్తూనే ఉంది అంటూ బాధతో మాట్లాడుతాడు యష్. అప్పుడు యష్ బాధను చూసి వేద కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యష్ పడుకొని ఏడుస్తూ ఉండగా కన్నీళ్లు తుడిచి నేను మీకు ఉన్నాను మిమ్మల్ని పడనివ్వను అని ధైర్యం చెబుతుంది. ఇప్పుడు యష్ ని నవ్వించడం కోసం ఖుషి గురించి చెప్పి నవ్వుతూ మాట్లాడుతుంది వేద. అప్పుడు యష్ కూడా నవ్వుతూ మాట్లాడతాడు. మరుసటి రోజు ఉదయం తెల్లారి సరికి వేద యష్ గుండెల పై పడుకొని ఉంటుంది. అప్పుడు వేదకు మెలకువ వచ్చి చూడగా భర్త గుండెల పై పడుకుంటే ఆ హాయో వేరని చాలా చెబుతుంటే విన్నాను అది ఇప్పుడు తెలుస్తోంది అని అనుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నించగా లేవకుండా అలాగే గట్టిగా పట్టుకుంటాడు.
అప్పుడు వేద నిద్ర లేచి కూర్చొని యష్ నిద్రపోతుండగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు యష్ నీ చూసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది వేద. తర్వాత పనిమనిషి ఆమె భర్త ఇద్దరూ రొమాంటిక్ మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి వేద ఆశ్చర్య పోతుంది. అప్పుడు అతడు తన భార్య కోసం పూలు తీసుకొచ్చి జడలో ఆమె సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు పాయసం తినిపించుకుంటూ ఉండటంతో అది చూసి వేద సంతోష పడుతూ ఉంటుంది. కనీసం ముత్యాలు ఆమె భర్తకి ఉన్న చనువు కూడా మా మధ్య లేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద అతను అక్క బావలను తలుచుకుంటూ ఉంటుంది.
మరొకవైపు వేద వాళ్ళ బాబు ఆఫీస్ కి వెళ్తూ ఉండగా వాళ్ళ అక్క సుహా అక్కడికి షూస్ తీసుకుని వస్తుంది. అప్పుడు ఆమె టిఫిన్ తీసుకుని రావడంతో నాకు వద్దు లేట్ అవుతుంది అని అనడంతో ఆమెను తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు భర్తను ప్రేమగా ఆఫీసుకు సాగనంపుతూ ఉంటుంది. తర్వాత వేద కు ఫోన్ చేస్తుంది. ఏంటి అక్క ఇంతసేపు అనడంతో మీ బావ గారితో బిజీగా ఉన్నాను మీ బావగారు లేచిన దగ్గర్నుంచి ఆఫీస్ కు వెళ్లే వరకు నాకు మీ బావ గారి పని సరిపోతుంది అనడంతో బావ ఏమైనా చిన్న పిల్లాడా అని అడగగా అలాగే అనుకో అని అంటుంది సుహా.
అప్పుడు ఆమె తన భర్త గురించి గొప్పగా చెప్పడంతో ఆ మాటలు విన్న వేద కూడా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన పాత జ్ఞాపకాలనుంచి బయటకు రాలేకపోతున్నారు అక్క అనడంతో నువ్వే చొరవ తీసుకొని ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేలా చేయాలి అంటుంది సుహా. ఆ మాళవిక చేసిన గాయాన్ని నువ్వే మాన్పేయాలి. నీ భర్తని నువ్వు తీర్చిదిద్దుకోవాలి అంటూ వేదకు మంచి మాటలు చెబుతుంది సుహా. కేవలం ఖుషికోసమే మా పెళ్లి అన్న ఒప్పందం నుంచి నువ్వు బయటపడు ఆ విషయాన్ని కూడా బయటపడేసి ఇద్దరు హ్యాపీగా ఉండండి అని అంటుంది. ఆ తర్వాత వేద రాణి దగ్గరకు వెళ్తుంది.
అప్పుడు వేద రాణితో చెప్పడానికి మొహమాట పడుతూ ఉండగా అప్పుడు రాణిఅక్కడికి రావడంతో రానిని హత్తుకుంటుంది వేద. అప్పుడు వేద, రాణి ఒకచోట వేద ఏదో విషయం చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉండడంతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది రాణి. అప్పుడు వేద టెన్షన్ పడుతుండడంతో అబ్బాయి గురించే కదా అని అంటుంది రాణి.