- Home
- Entertainment
- రష్మీతో హ్యాపినెస్ అన్న సుధీర్... తన లైఫ్ లో ఇదే బెస్ట్ డెసిషన్ అంటూ `జబర్దస్త్` యాంకర్ కన్నీళ్లు..
రష్మీతో హ్యాపినెస్ అన్న సుధీర్... తన లైఫ్ లో ఇదే బెస్ట్ డెసిషన్ అంటూ `జబర్దస్త్` యాంకర్ కన్నీళ్లు..
`జబర్దస్త్` యాంకర్ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. `జబర్దస్త్` షోలో ఆమె తన బెస్ట్ డెసీషన్ చెబుతూ ఎమోషనల్ అయ్యింది. అది తన లైఫ్‌లోనే బెస్ట్ డెసీషన్ అంటూ స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యింది. అందరిచేత కన్నీళ్లు పెట్టించింది రష్మీ.

`జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి తెలిసిందే. ఇదే ఈ కామెడీ షోకి హైలైట్. ప్రతి ఎపిసోడ్‌లోనూ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్‌గా చూపిస్తూ రేటింగ్ క్యాష్ చేసుకుంటుంది ఈటీవీ-మల్లెమాల.
వీరిద్దరు అందరికి లవర్స్ గానే తెలుసు. ఘాటు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని అంతా నమ్ముతున్నారు. షో కోసం, రేటింగ్ కోసం ఇలా చేసినప్పటికీ ఆడియెన్స్ మాత్రం ఈ జోడీని రియల్ లైఫ్ జోడిగానే భావిస్తున్నారు.
వీరిద్దరు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికున్న ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి తమ ప్రేమని `జబర్దస్త్` వేదికగా చాటి చెప్పారు.
తాను ఉన్నంత వరకు సుధీర్ కోసం డెడికేట్ చేస్తానని, తన లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ డెసీషన్ అని వెల్లడించింది. ఈ సందర్భంగా రష్మీ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే.. నెక్ట్స్ వీక్ `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో విడుదలైంది. ఇందులో చివర్లో కమెడీయన్ల హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్లు, సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు. అందులో భాగంగా రాకెష్, భాస్కర్, నరేష్, సుడిగాలి సుధీర్, రష్మీ ఇలా అందరు తమ కెరీర్‌కి సంబంధించి హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్లని పంచుకున్నారు. ఎమోషనల్ అయ్యారు. `జబర్దస్త్` లైఫ్ ఇచ్చిన విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ క్రమంలో సుధీర్ స్పందించారు. తొమ్మిదేళ్ల క్రితం రష్మీ, తాను కలిసినట్టు చెప్పాడు. ఓ సినిమా కోసం వీరిద్దరు కలిసి పనిచేయాలనుకున్నారట. అది తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూవ్‌మెంట్ అని తెలిపారు.
రష్మీ మాట్లాడుతూ, నేను ఉన్నంత వరకు తనకి డెడికేట్ చేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఈ విషయంలో నేను వెరీ వెరీ హ్యాపీ ఈ డెసిషన్ తీసుకున్నందుకు. ఇది నా జీవితంలో బెస్ట్ డెసిషన్ అంటూ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.
మరి రష్మీ డెడికేట్ చేసేది సుధీర్ కోసమేనా? లేక మరెవ్వరి కోసమైనా అనేది తెలియాల్సి ఉంది. చూడబోతే సుధీర్‌ని ఉద్దేశించే రష్మీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది.