MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: పెళ్లి ఎప్పుడో చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఆ సుఖాన్ని కోల్పోవడం ఇష్టం లేదట

Sudigali Sudheer: పెళ్లి ఎప్పుడో చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఆ సుఖాన్ని కోల్పోవడం ఇష్టం లేదట

సుడిగాలి సుధీర్‌ తన మ్యారేజ్‌పై స్పందించాడు. తరచూ రష్మి గౌతమ్‌తో ఆయన లవ్‌ ట్రాక్‌ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సుధీర్‌ కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన క్రేజీగా స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 20 2026, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుధీర్‌ జోకర్‌తో రాబోతున్న సుధీర్‌
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

సుధీర్‌ జోకర్‌తో రాబోతున్న సుధీర్‌

జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్‌ అయి ఇప్పుడు యాంకర్‌గా, హీరోగా బిజీగా ఉన్నాడు సుడిగాలి సుధీర్‌. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న సుధీర్‌ తన కొత్త సినిమాల అప్‌ డేట్లు ఇచ్చాడు. `సుధీర్‌ జోకర్‌` పేరుతో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాంగర్‌ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా, అది ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు సుధీర్‌. ఇందులో ఆయనకు పెళ్లి ప్రస్తావన వచ్చింది. దీనికి క్రేజీగా స్పందించాడు సుధీర్‌.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
పెళ్లిపై సుధీర్‌ కామెంట్‌
Image Credit : youtube/@aha

పెళ్లిపై సుధీర్‌ కామెంట్‌

అన్న పెళ్లి ఎప్పుడు అని ఒక అభిమాని ప్రశ్నించగా, ఇప్పుడు హాయిగా ఉన్నాను, స్వేచ్ఛగా, సుఖంగా ఉన్నాను, ఆ సుఖాన్ని కోల్పోమంటావా అని చెప్పాడు. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన లేదని, అలాంటి నిర్ణయానికి వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు చేసుకుంటాను, అప్పటి వరకు ఆ ఆలోచన లేదని తెలిపారు. అదే సమయంలో మ్యారేజ్‌ చేసుకుంటే కచ్చితంగా చెబుతానని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పట్లోనే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. మరోవైపు ప్రస్తుతం సినిమాలపై ఫోకస్‌ చేశానని, హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పాడు.

Related Articles

Related image1
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Related image2
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
35
రష్మితో లవ్‌ ట్రాక్‌
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

రష్మితో లవ్‌ ట్రాక్‌

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మి గౌతమ్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి జబర్దస్త్ షో చేశారు. ఇందులో ఇద్దరు కలిసి రొమాన్స్ చేశారు. డ్యూయెట్లు పడుతుకున్నారు. ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. నిజమైన లవర్స్ గానే రాణించారు. షోకి క్రేజ్‌ని తీసుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఈ షో నుంచి సుధీర్‌ తప్పుకున్నారు. దీంతో ఈ జంట విడిపోయింది. అయితే తమ మధ్య ఏం లేదని, తాము మోర్‌ దెన్‌ ఫ్రెండ్స్ అని ఇద్దరు చెప్పారు. కానీ అభిమానులు మాత్రం వీరిని విడిగా చూడలేకపోతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారో, అప్పుడు గానీ ఈ రూమర్లకి ముగింపు పలుకదు.

45
సుధీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

సుధీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నా బర్త్ డేను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం అలవాటు. ఈ సారి మాత్రం నా కుటుంబ సభ్యులుగా మారిపోయిన అభిమానులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ బర్త్ డే చాలా స్పెషల్ గా ఉంటుందని గట్టిగా అనిపిస్తోంది. సుధీర్ జోకర్ సినిమా బ్యాంగర్ రిలీజ్ తో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ స్పెషల్ గా మారిపోయాయి. సునీల్ నా దగ్గరకు కథ తీసుకొచ్చినప్పుడు బాగా నచ్చింది. అయితే కథ చెప్పినంత బాగా సినిమా చేయగలడా అనుకున్నాను. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. విజయ్ గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమాకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. డీవోపీ అహ్మద్ నేను ఇంత బాగా కనిపిస్తానా స్క్రీన్ మీద అనేంత బ్యూటిఫుల్ గా విజువల్స్ ఇచ్చారు. లియోన్ జేమ్స్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ బ్యాంగర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే కాదు నా ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ కూడా. ఈ బ్యాంగర్ నేను కూడా మీతో పాటే చూశాను. బ్యాంగర్ చాలా బాగుంది. చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా` అని అన్నారు.

55
సుధీర్‌ జోకర్‌ బ్యాంగర్‌ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

సుధీర్‌ జోకర్‌ బ్యాంగర్‌ ఎలా ఉందంటే?

`సుధీర్‌ జోకర్‌` మూవీ బ్యాంగర్ ఎలా ఉందో చూస్తే - నగరంలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. ఈ చోరీలు ఎవరు చేస్తున్నారనే ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. ఓ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన యువకుడే దొంగ అని తెలుస్తుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది ఆసక్తి కలిగిస్తోంది. బ్యాంగర్ లో టాప్ క్వాలిటీ విజువల్స్, బీజీఎం, షాట్ మేకింగ్ ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ ఈ బ్యాంగర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే క్యూరియాసిటీ `సుధీర్ జోకర్` బ్యాంగర్ కలిగిస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: రామ్‌ చరణ్‌ చివరి 5 సినిమాల్లో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని?.. బాక్సాఫీస్ రిపోర్ట్
Recommended image2
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image3
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Related Stories
Recommended image1
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image2
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved