MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది

NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది

ఎన్టీఆర్‌ తన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన టాప్‌ 5 డిజాస్టర్‌ సినిమాలేంటో చూస్తే, తారక్‌ కెరీర్‌ని ఇవి కోలుకోలేని దెబ్బ కొట్టాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 19 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎన్టీఆర్‌ టాప్‌ 5 డిజాస్టర్స్
Image Credit : youtube/sreyas media

ఎన్టీఆర్‌ టాప్‌ 5 డిజాస్టర్స్

జూ ఎన్టీఆర్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు టాప్‌ హీరోగా ఎదిగారు. తన ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఎవరి కెరీర్‌లో అయినా పరాజయాలు కామన్‌. కానీ కొన్ని కోలుకోలేని దెబ్బ కొడతాయి. ఎందుకు చేశాను రా అనే ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. అదే సమయంలో భారీ నష్టాలను తీసుకొస్తాయి. మరి ఎన్టీఆర్‌ కెరీర్‌లో టాప్‌ 5 చెత్త సినిమాలేంటనేది చూస్తే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
1.ఆంధ్రావాలా
Image Credit : imdb

1.ఆంధ్రావాలా

ఎన్టీఆర్‌ కెరీర్ లో టాప్‌ పరాజయాల్లో మొదటి వరుసలో ఉన్న మూవీ `ఆంధ్రావాలా`. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. వయసుకి మించిన పాత్ర చేశారు. రక్షిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2004 సంక్రాంతికి విడుదలైంది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా నిర్మాతకు దారుణమైన నష్టాలను తెచ్చిన చిత్రమిది.

Related Articles

Related image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Related image2
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
36
2.నా అల్లుడు
Image Credit : sun nxt

2.నా అల్లుడు

బ్యాక్‌ టూ బ్యాక్‌ మరో సంక్రాంతి కూడా ఎన్టీఆర్‌కి కలిసి రాలేదు. 2005లో ఆయన `నా అల్లుడు` అనే సినిమాలో నటించాడు. యాక్షన్‌ కామెడీ ప్రధానంగా వర ముల్లపూడి రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్‌, శ్రియా, జెనీలియా హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ అత్తగా కనిపించింది. ఇద్దరు మరదళ్లతో ఎన్టీఆర్‌ ఆడే ఆట కామెడీగా ఉంటుంది. కానీ అది వర్కౌట్‌ కాలేదు. దీంతో సినిమా తేడా కొట్టింది. నిర్మాతలను నిండా ముంచేసింది.

46
3.నరసింహుడు
Image Credit : aha

3.నరసింహుడు

అలాగే ఎన్టీఆర్‌కి మరో మర్చిపోలేని డిజాస్టర్‌ ఇచ్చిన చిత్రం `నరసింహుడు`. దీనికి బి గోపాల్‌ దర్శకత్వం వహించారు. అమీషా పటేల్‌, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ,యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ కూడా ఆడియెన్స్ కి ఆకట్టుకోలేకపోయింది. రెగ్యూలర్‌, రొటీన్‌, ఔట్‌ డేటెడ్‌ కథ అనే విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం 2005లో మే 20న ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా విడుదలైంది. తారక్‌కి మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

56
4.శక్తి
Image Credit : our own

4.శక్తి

తారక్‌ కెరీర్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాల్లో `శక్తి` ఒకటి. ఇందులోనూ ఎన్టీఆర్‌ రెండు పాత్రలు పోషించారు. ఫాంటసీ యాక్షన్‌ మూవీగా రూపొందించారు. మెహెర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ చిత్రం విషయంలో ఒక ప్రయోగం చేశారు. మొదట అనుకున్న కథ ఒకటి, ఆ తర్వాత తీసిన కథ మరోటి. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సైతం తారక్‌ కెరీర్‌లో చెత్త సినిమాల జాబితాలో చేరింది. ఈ సినిమా గురించి ఒక ఈవెంట్‌లో ఎన్టీఆరే చెప్పారు. ఈ మూవీ దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేనని. ఆ స్థాయిలో ఆయన్ని డిజప్పాయింట్‌ చేసిందీ సినిమా.  2011 ఏప్రిల్‌ 1న విడుదలైంది.

66
5.రామయ్యా వస్తావయ్యా
Image Credit : google

5.రామయ్యా వస్తావయ్యా

ఎన్టీఆర్‌ టాప్‌ 5 డిజాస్టర్లలో `రామయ్యా వస్తావయ్యా` చిత్రం కూడా ఉంటుంది. యాక్షన్‌ కామెడీగా దీన్ని హరీష్‌ శంకర్‌ రూపొందించారు. దిల్‌ రాజు నిర్మించారు. మొదట ఒక కథతో సినిమా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేశారు. సినిమా తేడా కొట్టింది. ఇందులో శ్రుతి హాసన్‌, సమంత హీరోయిన్లుగా నటించారు. క్రేజీ హీరోయిన్లు ఉన్నా, మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 2013 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Recommended image2
60 ఏళ్లలోనూ 20ల ఎలా? సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్‌గా ఉండటానికి.. ఆఒక్కటి అస్సలు తినడని తెలుసా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దీపపై కాంచన ఫైర్- శివన్నారాయణ ఎమోషనల్- కార్తీక్ ప్లాన్- జ్యోకు షాక్
Related Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved