Sudigali Sudheer: `జబర్దస్త్`కి సుధీర్ బిగ్ షాక్.. షోకి గుడ్‌బై.. రష్మీ ఫ్యాన్స్ ఆందోళన ?
సుడిగాలి సుధీర్ బుల్లితెర స్టార్. `జబర్దస్త్` షోతో పాపులర్ అయిన సుధీర్‌కి ఇప్పుడు భాషలకు అతీతంగా సోషల్ మీడియాలో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ `జబర్దస్త్` షోకి సుధీర్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) `జబర్దస్త్`(Jabardasth) కామెడీ షోతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్‌ని వినియోగించుకుని స్టార్ కమెడీయన్‌గా ఎదిగాడు. టీవీలో Sudigali Sudheer ఇప్పుడు స్టార్ రేంజ్ ఆర్టిస్ట్ కావడం విశేషం. ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. భాషలకు అతీతంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఇది సుధీర్ రేంజ్‌ని తెలియజేస్తుంది. ఆయన కామెడీ స్టయిల్‌ని తెలియజేస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో, పంచ్‌లతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు సుధీర్. `జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను చేసే సందడి అంతా ఇంతా కాదు. మధ్యలో హైపర్ ఆది కూడా వస్తూ సుధీర్‌పై డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేస్తూ కామెడీని రెట్టింపు చేస్తుంటాడు.
`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఆయన టీమ్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. Jabardasth కామెడీ షో ప్రారంభం నుంచి సుడిగాలి సుధీర్ షోలో ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఈ షోని మాత్రం వదల్లేదు సుధీర్. మల్లెమాలకి, ఈటీవీకి అంకితమై ఉండిపోయాడు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఇతర షోస్, సినిమాలు చేశాడు. కానీ `జబర్దస్త్`ని వదల్లేదు. తనకు లైఫ్ ఇచ్చిన షోని తాను వదులుకోకూడదని నిర్ణయించుకుని నిబద్దతతో పనిచేశాడు. ఇప్పుడు సుధీర్ లేన `జబర్దస్త్`ని ఊహించుకోగలమా అనే స్థాయికి ఎదిగాడు. ఈ షోకి మంచి టీఆర్పీ రేటింగ్ రావడంలో ఆయన స్కిట్ల పాత్ర ప్రధానంగా ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే త్వరలోనే సుడిగాలి సుధీర్.. `జబర్దస్త్` షోకి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ కామెడీ షో నుంచి ఇక తప్పుకోవాలనుకుంటున్నారట సుధీర్. `జబర్దస్త్` షో నుంచి సుధీర్ బయటకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. ఈ మేరకు ఆయన మల్లెమాల టీమ్‌తో కుదుర్చుకున్న డీల్‌ని కూడా క్యాన్సిల్ చేసుకోబోతున్నాడట. దీంతో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సుడిగాలి సుధీర్ హీరోగా మారిపోయాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో తనకు భారీ ఫాలోయింగ్ ఏర్పాడింది. ఈ నేపథ్యంలో హీరోగా రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన `సాఫ్ట్ వేర్ సుధీర్`తో మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకి ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్లు వచ్చాయి. నిర్మాతలు సేఫ్ అయ్యారు. అనంతరం `త్రీమంకీస్` పేరుతో మరో సినిమా చేశాడు. రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి నటించారు. వీటికి మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి హీరోగా టర్న్ తీసుకోవాలనుకుంటున్నారట. అదే సమయంలో సుధీర్‌కి సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇతర సినిమాల్లో కమెడీయన్‌గా కీలక పాత్రలొస్తున్నాయి. దీంతోపాటు `ఢీ` షోలో కింగ్స్ టీమ్‌కి లీడర్‌గా, `శ్రీదేవి డ్రామా కంపెనీ` కి హోస్ట్ గా చేస్తున్నాడు.
దీంతో `జబర్దస్త్` షో కారణంగా సినిమాలకు టైమ్ ఇవ్వడం కుదరడం లేదని, దీంతో ఈ షోకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్టు ఓ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నటుడిగా కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట సుధీర్. `జబర్దస్త్` లో ఉంటే ఇంకా పరిమితమైన ఫాలోయింగ్, ఇమేజ్‌తోనే ఉండిపోవాల్సి వస్తుంది. తన మార్కెట్ పెంచుకునేందుకు ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా,సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ `జబర్దస్త్` షోకి గుడ్‌బై చెప్పబోతున్నాడనే వార్తతో యాంకర్ రష్మి అభిమానులు ఆందోళన చెబుతున్నారు. సుడిగాలి సుధీర్-రష్మిలు లేని `ఎక్స్ ట్రా జబర్దస్త్`ని ఊహించుకోలేమనే డైలాగ్ చాలా రోజుల నుంచే వినిపిస్తుంది. ఈ ఇద్దరి కోసమే `జబర్దస్త్` షోని చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి సుధీర్ లేని రష్మిని ఊహించుకోవడం కష్టమే అని, సుధీర్ లేని షోని ఊహించుకోవడం కష్టమనే అని రష్మి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. రష్మిని `జబర్దస్త్`లో ఒంటరిగా చూడలేమని అభిప్రాయాన్ని ఆమె ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మల్లెమాల నిర్వహకులుగానీ, సుధీర్‌గానీ స్పందించిస్తేగాని క్లారిటీ వస్తుంది.
also read: Bheemla nayak postpone ?: వెనక్కి తగ్గునున్న పవన్ కళ్యాణ్.. వెనకాల జగన్.. అసలు కారణాలివే?