సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లో రాణించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్ గురించి కూడా చెప్పుకోవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Sudigali Sudheer
బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లో రాణించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్ గురించి కూడా చెప్పుకోవచ్చు. సుధీర్ పేరు చెప్పగానే అతడు జబర్దస్త్ లో చేసిన కామెడీ గుర్తుకువస్తుంది. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లతో కలిసి సుధీర్ చేసిన కామెడీని ప్రేక్షకులు మర్చిపోలేరు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో సుధీర్ సినిమాల్లో కూడా ప్రయత్నించాడు.
సుధీర్ కి ప్రస్తుతం హీరోగా అవకాశాలు వస్తున్నాయి. అతడు హీరోగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ సుధీర్ కి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక బుల్లితెరపై సుధీర్, రష్మీ మధ్య ఎఫైర్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. సుధీర్ హీరోగా వచ్చిన అవకాశాలు అందుకుంటూనే బుల్లితెరపై కొన్ని షోలకు యాంకర్ గా కూడా చేస్తున్నాడు.
తాజాగా సుధీర్ ఫ్యామిలీ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సుధీర్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. 37 ఏళ్ల వయసు వచ్చినా సుధీర్ ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అయితే ప్రస్తుతం సుదీర్ ఇంట్లో జరుగుతున్న సంబరాలు అతని పెళ్లి గురించి కాదు. సుధీర్ కి ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. వీళ్ళిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. సుధీర్ చెల్లి శ్వేత అమెరికాలో సెటిల్ అయ్యారు.
Sudigali Sudheer
సుధీర్ తమ్ముడు రోహన్ కి, రమ్య అనే అమ్మాయికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక కుమార్తె సంతానం ఉంది. తాజాగా రోహన్ రమ్య దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. రమ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తని రోహన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో సుధీర్ అభిమానులంతా రోహన్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
Sudigali Sudheer
తమ ఫ్యామిలీలోకి వారసుడు రావడంతో సుడిగాలి సుదీర్ కుటుంబం మొత్తం సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం సెటైర్లు వేస్తున్నారు. తమ్ముడు ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. ఇప్పటికైనా సుధీర్ పెళ్లి చేసుకుంటాడా లేదా అంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడు, కాలింగ్ సహస్ర లాంటి చిత్రాల్లో సుధీర్ హీరోగా నటించారు.