- Home
- Entertainment
- OM Box Office: బాక్సాఫీస్ వద్ద ధనుష్ ఊచకోత.. 'ఓం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
OM Box Office: బాక్సాఫీస్ వద్ద ధనుష్ ఊచకోత.. 'ఓం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటించిన 'ఓ.మ్' (Operation Mole) సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లని సాధించింది. ధనుష్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.

బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోన్న ఓం
తమిళనాడులో తక్కువ థియేటర్లలోనే విడుదలైనప్పటికీ, ధనుష్ నటించిన 'ఓ.మ్' (Operation Mole) సినిమా తొలి రోజే డబుల్ డిజిట్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాదు, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది.
భారీ అంచనాలతో వచ్చిన ధనుష్ ఓం
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు నటించిన 'ఓ.మ్'(ఆపరేషన్ మోల్) సినిమా 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఉదయం 6 గంటల స్పెషల్ షో ముగిసిన వెంటనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా 'యావరేజ్', 'ఎబౌ యావరేజ్' అంటూ కామెంట్స్ వచ్చాయి. అయినా సరే, ఆ రివ్యూలను పక్కనపెట్టి ధనుష్ అభిమానులు ఈవినింగ్, నైట్ షోలకు థియేటర్లకు పోటెత్తారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా పెరిగాయి.
ఫస్ట్ డే వసూళ్ల వివరాలు
'అమరన్' సినిమాతో భారీ హిట్ కొట్టిన రాజ్‌కుమార్ పెరియసామిపై ఉన్న నమ్మకంతో 'ఓం' సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 'ఓం' సినిమా అత్యధికంగా రూ.31.55 కోట్లు వసూలు చేసింది. భాషల వారీగా, ఓవర్సీస్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళం: రూ.13.35 కోట్లు
తెలుగు: రూ.4 కోట్లు
హిందీ: రూ.35 లక్షలు
ఓవర్సీస్: రూ.11 కోట్లు
(గమనిక: మరో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దేశీయంగా రూ.20.70 కోట్లు, ఓవర్సీస్లో రూ.9.90 కోట్లు కలిపి మొత్తం రూ.30.60 కోట్లు వసూలు చేసినట్లు అంచనా).
3 రోజుల్లో రూ.100 కోట్లు టచ్ చేస్తుందా?
'ఓం' సినిమా శని, ఆదివారాల్లో ఇదే జోరు కొనసాగిస్తే, విడుదలైన మొదటి 3 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ధనుష్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలో మొదటి 3 రోజుల్లో రూ.100 కోట్లు దాటితే ధనుష్‌కు ఇది అదిరిపోయే 'కంబ్యాక్' మూవీ అవుతుంది. తొలి రోజు ఈ సినిమాను ప్రదర్శించని రోహిణి వంటి కొన్ని ప్రముఖ థియేటర్ల సమస్యలు కూడా పరిష్కారం కావడంతో, శనివారం నుంచి 'ఓం' కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.















