- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్ ట్రీట్‌కి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్.. `జబర్దస్త్` కమేడియన్ తెరవెనుక ప్లాన్ అదిరింది!
సుడిగాలి సుధీర్ ట్రీట్‌కి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్.. `జబర్దస్త్` కమేడియన్ తెరవెనుక ప్లాన్ అదిరింది!
సుడిగాలి సుధీర్ `జబర్దస్త్`తో టీవీలో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హీరోగా మారి వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో సుధీర్ మెగాఫ్యాన్స్ ని ఊహంచని విధంగా సర్‌ప్రైజ్ చేసి వారికి దగ్గరవుతున్నారు.

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer).. బుల్లితెరపై ఇప్పుడు ఓ సూపర్ స్టార్. ఆయనకు ఆ రేంజ్‌లో ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడిందంటే కారణం `బజర్దస్త్` అని చెప్పాల్సిందే. ఇందులో ఆయన గెటప్ శ్రీను, రాంప్రసాద్‌లతో కలిసి స్కిట్లు చేసి ఆద్యంతం నవ్వులు పూయించారు. `జబర్దస్త్`లో అత్యంత పాపులర్ టీమ్‌గా నిలిచారు. వీరి టీమ్‌కి, సుధీర్‌కి `జబర్దస్త్` విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది.
దీనికితోడు యాంకర్ రష్మి(Rashmi)తో కలిసి ఆయన చేసే రొమాన్స్ ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తూ వస్తోంది. ఇద్దరు స్టేజ్‌పై ప్రేమ గీతాలు పాడుకుంటూ, డాన్సులేస్తూ, ప్రేమ కథలు చెప్పుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. ఈ జంట నిజంగానే ప్రేమికులుగా ఫీలయ్యేంతగా షోలో రచ్చ చేయడం విశేషం. అయితే ఇటవలే సుధీర్ `జబర్దస్త్`ని వదిలేశాడు. ఆయన స్టార్ మాలో `సూపర్ సింగర్ జూనియర్` షోలో యాంకర్‌గా చేస్తున్నారు. అనసూయతో కలిసి రచ్చ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్.. మెగాఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు. సుధీర్ చేసిన పనికి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. జబర్దస్త్ కమేడియన్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. అభిమానులుగా మారిపోతున్నారు, మరి అంతగా సుధీర్ ఏం చేశాడంటే.. చిరంజీవి సినిమా పాట పాడటమే.
సుధీర్ మంచి కమేడియన్ మాత్రమే కాదు, అంతకు ముందు మేజిషియన్ అనే విషయం తెలిసిందే. ఆయనలో మంచి సింగర్‌గా కూడా ఉన్నారు. ఆ మధ్య రష్మికోసం బ్యాక్ టూ బ్యాక్ ప్రేమ గీతాలు పాడి ఆకట్టుకున్నారు. అందరిని ఆశ్చర్యపరిచారు. రష్మి మాత్రం ఏకంగా ముగ్దురాలైపోవడం విశేషం. తాజాగా సుధీర్ మరోసారి పాట పాడారు. చిరంజీవి పాట పాడటం ఓ విశేషమైతే, అది చిత్రతో కలిసి ఆయన పాటపాడటం విశేషం.
`సూపర్ సింగర్స్ జూనియర్స్ `(Super Singer Junior)షోలో సింగర్ చిత్రతో కలిసి సుధీర్ పాట పాడాడు. అది చిరంజీవి పాట కావడం విశేషం. `అందం హిందోళం` అంటూ పాట పాడి సర్‌ప్రైజ్ చేశాడు. అచ్చం ప్రొఫేషనల్ సింగర్ మాదిరిగానే పాట పాడటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
చిరంజీవి(Chiranjeevi), విజయశాంతి, రాధా కలిసి నటించిన `యముడికి మొగుడు` చిత్రంలోనిది `అందం హిందోళం` పాట. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి. సుశీల కలిసి ఆలపించారు. అప్పట్లో ఈ పాట సంచలన విజయం సాధించింది. చిరు, రాధాల బ్రేక్ డాన్సుకి అభిమానులు ఫిదా అయ్యారు. థియేటర్లలోనే స్టెప్పులేసి హోరెత్తించారు. ఆ ఊపు గుర్తు చేశాడు సుడిగాలి సుధీర్. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సుధీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగా అభిమానులకు దగ్గరవడం విశేషంగా చెప్పొచ్చు. `జబర్దస్త్`ని వీడి `స్టార్ మా`లో సూపర్ సింగర్ జూనియర్స్ కి హోస్ట్ గా చేయడం గమనార్హం. `జబర్దస్త్` కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వడం వల్లే ఈ షో చేస్తున్నట్టు తెలుస్తుంది.