MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: 25 కోట్లతో సుడిగాలి సుధీర్ - నిహారిక కాంబినేషన్ లో సినిమా? స్వయంగా ప్రకటించిన మెగా డాటర్..

Sudigali Sudheer: 25 కోట్లతో సుడిగాలి సుధీర్ - నిహారిక కాంబినేషన్ లో సినిమా? స్వయంగా ప్రకటించిన మెగా డాటర్..

మెగా డాటర్ నిహారిక.. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో సినిమా..? దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్ తో ఆమూవీ తెరకెక్కబోతోందా? ఈ విషయంలో నిజం ఎంత? నిహారిక స్వయంగా ఏమని ప్రకటించింది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్
Image Credit : youtube/@aha

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న టెలివిజన్ స్టార్ సుడిగాలి సుధీర్. వెండితెరపై హీరోగాకొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ‘జబర్దస్త్’ కామెడీ షో లో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. ఆతరువాత యాంకర్ గా మారి రష్మీ,ప్రదీప్ తో కలిసి పలు షోలు హోస్ట్ చేశాడు. దాంతో సుధీర్ ఇమేజ్ మరింతగాపెరిగిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వెండితెరపై కనిపించని ప్రభావం..
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

వెండితెరపై కనిపించని ప్రభావం..

బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్.. ఆతరువాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. సుధీర్ నటించిన ‘గాలోడు’ చిత్రం కమర్షియల్‌గా మంచి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఆపరేషన్ సహస్ర’ సినిమాకి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం సుధీర్ ‘హైలెస్సో’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

36
హోస్ట్ గా బిజీ అయిపోయిన సుడిగాలి సుధీర్..
Image Credit : our own

హోస్ట్ గా బిజీ అయిపోయిన సుడిగాలి సుధీర్..

సినిమాల కంటే కూడా సుధీర్ కి టెలివిజన్ లోనే అభిమానులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఓటీటీ షోలలో కూడా యాంకర్‌గా బిజీగా ఉన్నాడు సుధీర్. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆట డ్యాన్స్ షో జీ తెలుగులో మంచి స్పందన రాబట్టింది. సుధీర్ అభిమానులు మిస్ అవ్వకుండా చూడటంతో.. ఈ షోకు మంచి టీఆర్పీలు వచ్చినట్టు తెలుస్తోంది. . ఈ షో మొదటి సీజన్ త్వరలో గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.

46
నిరిహారిక ‌- సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో సినిమా?
Image Credit : Asianet News

నిరిహారిక ‌- సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో సినిమా?

ఇక జబర్ధస్త్ టైమ్ నుంచి నాగబాబు.. ఆయన కూతురు నిరిహారికతో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు సుడిగాలి సుధీర్. నిహారికతో కొన్ని షోలు కూడా చేశాడు. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ షోలో నిహారిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఈ మధ్య సుధీర్ హోస్ట్ చేస్తున్న షోకి సబంధించిన ఒక ఎపిసోడ్‌లో రాధిక శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. సుధీర్, నిహారిక కొణిదెల, సీనియర్ నటి రాధికా మధ్య జరిగిన సంభాషణ ఆడియన్స్ ను అలరించింది.

56
సుధీర్ పై 25 కోట్ల బడ్జెట్‌ సాధ్యమేనా?
Image Credit : Asianet News

సుధీర్ పై 25 కోట్ల బడ్జెట్‌ సాధ్యమేనా?

నిహారిక సుధీర్‌ను హీరోగా పెట్టి రూ.25 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తానని ప్రకటించింది. అదే సమయంలో రాధికా కూడా సుధీర్ తో సినిమా చేస్తానని అన్నారు. సుధీర్ మాత్రం రాధికతో సినిమా ఇప్పుడప్పుడే చేయలేను.. చాలా బీజీగా ఉన్నాను, అందుకే నిహారిక సినిమాకు మాత్రమే డేట్స్ ఇస్తానని అన్నాడు. అయితే ఇదంతా నిజం కాదని.. ఆడియన్స్ కు ఆతరువాత అర్ధం అయ్యింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈముగ్గురు స్టార్స్ ఓ సరదా స్కిట్ చేసినట్టు తెలుస్తోంది.

66
నిహారిక నిజంగానే సినిమా చేయబోతోందా?
Image Credit : nikiluu youtube screen shot

నిహారిక నిజంగానే సినిమా చేయబోతోందా?

అయితే ఈ స్కిట్ కేవలం వినోదం కోసమే అయినప్పటికీ... సుధీర్‌ను హీరోగా తీసుకుని సినిమా చేయాలని నిహారిక కొణిదెల ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిర్మాతగా నిహారిక ఈ మధ్య వరుస హిట్లు కొడుతోంది. దాంతో ఆమె నిర్మించిన ‘రాకాస’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు మానస శర్మ తో.. సుధీర్ హీరోగా ఈ ప్రాజెక్ట్‌ ను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ భారీగా కాకపోయినా, సుధీర్‌కు సరిపోయే మంచి కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Related Stories
Recommended image1
9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి, 29 ఏళ్ల వయసులో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved