MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

కొంత మంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ కాలం గుర్తుండిపోతారు. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ హీరోయిన్, మూడేళ్లలో ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలింది. 19 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంతకీ ఎవరా తార? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్న వయసులోనే కన్నుమూసిన హీరోయిన్
Image Credit : Asianet News

చిన్న వయసులోనే కన్నుమూసిన హీరోయిన్

కొంత మంది హీరోయిన్లు చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతాలు చేశారు. 14 నుంచి 20 ఏళ్ళ మధ్యలో హీరోయిన్లుగా తెరపైకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరు స్టార్ హీరోయిన్లు గా మారి, బాగా సంపాదించి,పెళ్లిళ్లు చేసుకునిసెటిల్ అయ్యారు. మరికొందరు మధ్యలోనే ఇండస్ట్రీని వదిలి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక ఆ కోవలోకే వస్తుంది దివంగత తార దివ్యభారతి. ఆమె చాలా చిన్నవయసులోనే స్టార్ డమ్ ను చూసింది... 20 ఏళ్ళు రాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా దివ్య భారతి..
Image Credit : instagram

18 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా దివ్య భారతి..

దివ్య భారతి 16 ఏళ్లకే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళంలో ఓ సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. వెంటనే తెలుగులో వెంకటేష్ జోడీగా బొబ్బిలి రాజా సినిమాలో నటించి మెప్పించింది. ఈసినిమాతో ఆమె కెరీర్ పరుగులు పెట్టింది. ఒక్క దెబ్బతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. 

36
తెలుగులో దివ్య భారతి సినిమాలు
Image Credit : our own

తెలుగులో దివ్య భారతి సినిమాలు

తెలుగులో వరుసగా అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రం, చిట్టెమ్మ మొగుడు లాంటి సినిమాల్లో వెంట వెంటనే అవకాశాలు అందాయి. తెలుగులో నాటుగైదు సినిమాలు చేసిన తరువాతే ఆమె బాలీవుడ్ వైపు వెళ్లింది. అక్కడ అడుగు పెట్టడంతోనే హిట్లు మీద హిట్లు కొడుతూ.. ఏడాదిలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

46
3 ఏళ్లలో 25 సినిమాలు..
Image Credit : our own

3 ఏళ్లలో 25 సినిమాలు..

ఇండస్ట్రీలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే తెలుగు, హిందీ పరిశ్రమల నుంచి దాదాపు 25 సినిమాలు చేసిన దివ్య భారతి.. చాలా బిజీ ఆర్టిస్ట్ గా వెలుగు వెలిగింది. 18 ఏళ్లకే ఏ హీరోయిన్ చూడలేనంత స్టార్ డమ్ చూసిన దివ్య భారతి జీవితం.. పెళ్లి తరువాత మారిపోయింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే నిర్మాత సాజిద్ ను ప్రేమించి పెళ్లాడింది దివ్య భారతి. పెళ్లి చేసుకోవడం దివ్య భారతికి చాలా ప్రాబ్లమ్స్ ను తెచ్చిపెట్టింది. మంచి ఇల్లు కొని తల్లీ తండ్రులను సంతోషపెట్టాలని ఆశతో ఎంతో ఉత్సాహంగా పని చేసిన ఆమె, ఇంటిని కొని అందులోకి వెళ్లకుండానే కన్నుమూసింది.

56
19 ఏళ్ల వయసులో మరణం..
Image Credit : pinterest

19 ఏళ్ల వయసులో మరణం..

1993 లో 19 ఏళ్ల వయసులో దివ్య భారతి నాలుగు అంతస్థుల మేడ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ అనుమానాస్పదమే. 34 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఆమె మరణానికి అసలు కారణాలు తేల్చలేకపోయారు. మరణించేనాటికి ఆమె చేతిలో 12 సినిమాలకు పైగా ఉన్నాయి. ఆమె మరణంతో అవి ఇతర హీరోయిన్లకు వెళ్లిపోయాయి. దివ్య భారతి వదిలేసిన సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్లుగా మారినవారు చాలామంది ఉన్నారు.

66
మిస్టరీగానే మిగిలిపోయింది..
Image Credit : our own

మిస్టరీగానే మిగిలిపోయింది..

దివ్య భారతి ప్రమాదంలో మరణించకుండా ఉండి ఉంటే.. ఆమెమరో శ్రీదేవి అయ్యేది అని అభిమానులు అంటుంటారు. మూడేళ్లలోనే ఇండస్ట్రీపై ఇంత ప్రభావం చూపించిందంటే... ఆమె ఓ పదిహేనేళ్ళు హీరోయిన్ గా సినిమాలు చేసుంటే.. ఎలా ఉండేదో అని అభిమానులు ఇప్పటికీ అనుకుంటుంటారు. ఆమె ఎదుగుదల చూడలేకే దివ్యభారతిని చంపేశారని అనే వాదన కూడా ఉంది. చాలా సంవత్సరాల విచారణ తరువాత ఏం తేల్చకుండానే ఈ కేసును పోలీసులు మూసేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
9 ఏళ్ల కెరీర్ లో 100 కోట్ల ఆస్తి, 29 ఏళ్ల వయసులో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved