MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Savitri: ఉదయం 4 గంటలకే లేచి క్యూలో నిల్చొన్న సావిత్రి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు నిద్రలేని రాత్రులు.. ఏం జరిగిందంటే?

Savitri: ఉదయం 4 గంటలకే లేచి క్యూలో నిల్చొన్న సావిత్రి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు నిద్రలేని రాత్రులు.. ఏం జరిగిందంటే?

మహానటి సావిత్రి నటన పరంగా అప్పటి లెజెండ్స్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు పోటీ ఇచ్చేది. కానీ ఒక విషయంలో మాత్రం వారికి నిద్ర లేకుండా చేసేదట. ఆ కథేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 02 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు నిద్రలేకుండా చేసిన సావిత్రి
Image Credit : Asianet News

ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు నిద్రలేకుండా చేసిన సావిత్రి

మహానటి సావిత్రి జీవితం ఎంతో మందికి ఆదర్శం. అదే సమయంలో ఒక గుణపాఠం. లైఫ్‌లో ఎలాంటి తప్పులు చేయోద్దనేదానికి ఒక పాఠంగా చెప్పొచ్చు. కానీ సావిత్రి జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. గొప్పతనం ఉంది, బాధలున్నాయి. అనేక స్ట్రగుల్స్ ఉన్నాయి. అంతులేని పోరాటం ఉంది. కానీ వీటన్నింటికి మించి ఆమె అద్భుతమైన నటి అనేదే జనాల్లో ముద్రపడిపోయింది. దానికి కారణం ఆమె డెడికేషన్‌. నటన పట్ల ఉన్న ఇష్టం. కానీ ఒక విషయంలో మాత్రం సావిత్రి.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు నిద్ర లేకుండా చేసిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేకప్‌ కోసం క్యూలో సావిత్రి
Image Credit : Facebook/@mahanatiSavitri

మేకప్‌ కోసం క్యూలో సావిత్రి

సావిత్రి ఎంత గొప్పనటి అయినా, స్టార్‌ హీరోయిన్‌ అయినా ఆమె తన పని విషయంలో మాత్రం నిత్య విద్యార్థిగానే ఉండేది. స్టార్‌ డమ్‌ అనే భావన ఒక్క విషయంలోనూ కనిపించలేదు. ఆమె ఎవరితోనూ చూపించలేదు. ఆ టైమ్‌లో సినిమా తారలకు మేకప్‌ వేయడానికి ఎక్కువగా మేకప్‌ ఆర్టిస్ట్ లు ఉండేవారు కాదు, చాలా లిమిటెడ్‌గా ఉండేవారు. ఒక మేకప్‌ ఆర్టిస్ట్ కోసం సావిత్రి ఏకంగా లైన్‌లోనే నిల్చున్నారట. నాలుగు గంటలకే లేచి క్యూలో ఉండేదట.

Related Articles

Related image1
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
Balakrishna: నా కెరీర్ లో పెద్ద రాడ్డు లాంటి సినిమా అదే, ఒప్పుకున్న బాలయ్య..ఇష్టమైన మూవీ కూడా ఫ్లాపే
34
క్యూలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి
Image Credit : Asianet News

క్యూలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి

సినిమా స్టార్స్ కి మేకప్‌ చాలా కీలకం. మేకప్‌ వేయనిదే షూటింగ్‌ స్టార్ట్ అయ్యేది కాదు. కానీ ఇప్పటి మాదిరిగా ఎక్కువగా మేకప్‌ ఆర్టిస్ట్ లు ఉండేవారు కాదు. ఉన్న కొంత మందికి చాలా డిమాండ్‌ ఉండేది. అలా అప్పట్లో హరిబాబు అని పెద్ద ఫేమస్‌ మేకప్‌ ఆర్టిస్ట్ ఉండేవాడు. పూర్తి పేరు హరిపాద చంద్ర. ఆయన మేకప్‌ వేస్తే తిరుగులేదు. సినిమా ఆరు, ఏడు గంటలకు షూటింగ్‌ స్టార్ట్ కావాలంటే.. ఆర్టిస్ట్ లు ఆరుగంటల వరకు సెట్‌ లో ఉండాలి. అలా జరగాలంటే ముందుగానే మేకప్‌ వేసుకోవాలి. మేకప్‌ ఆర్టిస్ట్ హరిబాబు వద్ద చిన్నా,పెద్దా అనే తేడా లేదు. ఎంత పెద్ద స్టార్‌ అయినా క్యూలో ఉండాల్సిందే. దానికి సావిత్రి అయినా, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అయినా అతీతం కాదు.

44
మేకప్‌ కోసం తిప్పలు
Image Credit : Facebook/@mahanatiSavitri

మేకప్‌ కోసం తిప్పలు

దీంతో తనకు లేట్‌ కాకూడదని, దర్శక, నిర్మాతలతో మాట రాకూడదని సావిత్రి మూడు, నాలుగు గంటలకే వెళ్లి ఆయన వద్ద క్యూలో ఉండేదట. చాలా వరకు తనే మొదట ఉండేలా చూసుకునేదట. ఈ విషయంలో సావిత్రి, కృష్ణకుమారి ల మధ్య గట్టి పోటీ ఉండేదట. అయితే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు మాత్రం ఈ పోటీలో వెనకబడి పోయేవారని, వారికి సావిత్రి నిద్ర లేకుండా చేపిందట. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. ఆయన విజయా సంస్థలో పనిచేశారు. కేవీ రెడ్డి వద్ద అసిస్టెంట్‌గా చేసే సమయంలో ఇవన్నీ తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. మహానటి సినిమా సమయంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఆమె డెడికేషన్‌ లెవల్‌ని  వెల్లడించారు. ఇదే కాదు సావిత్రి నటనలోనూ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌కు గట్టి పోటీ ఇచ్చేది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సావిత్రి (నటి)
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది, నాగార్జునని ఏకిపారేసిన అన్వేష్..వెధవలు స్కూల్స్ కి వెళ్లడం ఏంటి ?
Recommended image2
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Related Stories
Recommended image1
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Balakrishna: నా కెరీర్ లో పెద్ద రాడ్డు లాంటి సినిమా అదే, ఒప్పుకున్న బాలయ్య..ఇష్టమైన మూవీ కూడా ఫ్లాపే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved