- Home
- Entertainment
- రష్మి ముందే వర్షని లైన్‌లో పెట్టిన సుడిగాలి సుధీర్.. అన్యాయాన్ని తట్టుకోలేక దాడికి దిగిన ఇమ్మాన్యుయెల్
రష్మి ముందే వర్షని లైన్‌లో పెట్టిన సుడిగాలి సుధీర్.. అన్యాయాన్ని తట్టుకోలేక దాడికి దిగిన ఇమ్మాన్యుయెల్
యాంకర్ రష్మి- సుడిగాలి సుధీర్ ఓ వైపు, వర్ష-ఇమ్మాన్యుయెల్ మరోవైపు ఈ రెండు జంటలు `జబర్దస్త్` షోలో తెగ ప్రేమించుకుంటోన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యింది. సుధీర్‌ని రష్మి ఛీ కొట్టగా, వర్షతో రొమాన్స్ కి సిద్ధమవడం విశేషం.

`జబర్దస్త్` కామెడీ షో కామెడీని పంచడంతోపాటు ప్రేమ జంటలను తయారు చేసే కంపెనీగానూ మారిపోతుంది. ఇందులోనుంచి రష్మి-సుధీర్, వర్ష-ఇమ్మాన్యుయెల్, రాకేష్-సుజాతతోపాటు తీస్తే ఇంకా రెండు మూడు జంటలు వస్తాయి. వీరి మధ్య కెమిస్ట్రీని హైలైట్‌గా కామెడీని పంచుతున్నారు మల్లెమాల నిర్వహకులు.
యాంకర్ రష్మి, సుధీర్ జంట ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. ఎన్నో సార్లు జబర్దస్త్ కి ఈ ఇద్దరు నిలబెట్టారు. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ ఇస్తుంటారు. అలాగే ఇమ్మాన్యుయెల్, వర్షలు సైతం ఇలాంటి కంటెంట్‌తోనూ రాణిస్తుంది. తమదైన కామెడీతో అలరిస్తూ, ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్ కి పెద్ద దెబ్బ పడబోతుంది. రష్మి హ్యాండివ్వడంతో వర్షతో పులిహోర కలిపాడు సుధీర్. దీంతో ఇప్పుడు ఇమ్మాన్యుయెల్ కి గట్టి దెబ్బ పడబోతుందని తెలుస్తుంది.
కొన్ని రోజుల పాటు జబర్దస్త్ ని సుడిగాలి సుధీర్ వదిలేసిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించింది. సినిమాలతో బిజీగా ఉండటం, ఇతర టీవీ ఛానెల్‌లో ఆయనకు ఆఫర్ రావడంతో జబర్దస్త్ ని వదిలేశాడు. అవి కంప్లీట్ కాగానే మళ్లీ `జబర్దస్త్`కి వచ్చాడు సుధీర్. ఈ వారం నుంచి ఆయన సందడి చేయబోతున్నారు.
అయితే వచ్చీ రావడంతో పెద్ద ఫిట్టింగ్‌లు పెట్టారు. షోలో ఇతర కమెడియన్ల లవర్స్ ని గెలకడం స్టార్ట్ చేశారు. షోలో మరోసారి రష్మికి ప్రపోజ్ చేశాడు. వాడిపోయిన గులాబి పువ్వుని తీసుకుని `నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ, నువ్వే ఏడిస్తే నేను చచ్చిపోతా` అని మరోసారి తన పాపులర్ డైలాగ్‌ని చెప్పాడు. దీంతో రష్మి పెద్ద షాకిచ్చింది. చావు రా చావు అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో సుధీర్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. షోలో నవ్వులు విరిసాయి.
ఆ తర్వాత గాలి వారి పెళ్లి పిలుపు అనే కార్యక్రమంలో ఊహించని విధంగా వర్షతో కలిసి స్టెప్పులేశాడు సుధీర్. అంతేకాదు వర్ష పెళ్లికూతురిలా ముస్తాబు కావడం విశేషం. అందరి ముందే సుధీర్‌ని నిలదీసింది వర్ష. అయితదా మన పెళ్లి అసలు అని అనగా, `గాలోడు` రిలీజ్ కాగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు సుధీర్. సరే నాకు అర్థమైంది ఇది అవదని అంటూ చెప్పడంతో సుధీర్‌కి దిమ్మతిరిగిపోయింది.
ఇక వర్ష, ఇమ్మాన్యుయెల్ పెళ్లికి సంబంధించిన ఫోటో షూట్‌ని సుధీర్ కెమెరాతో షూట్ చేస్తున్నారు. పంచె కట్టుకున్న ఇమ్మాన్యుయెల్ సరిగ్గా పోజులివ్వకపోవడంతో సుధీర్ వెళ్లి చూపించాడు. వర్షని తన రెండు చేతులతో రొమాంటిక్ యాంగిల్ లో పట్టుకుని పోజులిచ్చాడు. దీంతో రగిలిపోయిన ఇమ్మాన్యుయెల్ ఈ పంచ, షర్ట్ వేసుకుని నువ్వే చేసుకో షూట్ అంటూ ఫైర్ అయ్యాడు. మళ్లీ ఎందుకొచ్చావ్ రా అంటూ విరుచుకుపడ్డాడు ఇమ్మూ. దీంతో మరోసారి షో నవ్వులతో దద్దరిల్లిపోయింది.
ఆవేశంలో సోఫాలో కూర్చొని ఊగిపోతున్న ఇమ్మూని కూల్ చేయాలని భావిస్తాడు ఈవెంట్ మేనేజర్ భాస్కర్. మంచి ఆర్కేస్టా ఉన్నాడు అద్భుతంగా పాటలు పాడతాడని చెప్పడంతో పాడమని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఇమ్మూ. దీంతో మళ్లీ సుధీర్ వచ్చి వర్ష పక్కన కూర్చొని `నాతో వస్తావా నాతో వస్తావా.. `అంటూ పాట పాడుతుండగా, దానికి వర్ష కూడా వస్తా అన్నట్టుగా తలూపుతూ తాను కూడా పాట పాడుతుంది. మధ్య ఇమ్మాన్యుయెల్ కూడా పాట అందుకుని మరింతగా రెచ్చిపోయాడు, సుధీర్ వద్దకెళ్లి ఏం చేస్తున్నావ్ అంటూ ఆయన్ని కొట్టడం విశేషం.
మొత్తంగా మొత్తంగా సుధీర్ వచ్చీ రాగానే వర్ష వెంటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అందుకు వర్ష కూడా సుముఖంగానే ఉండటం ఇప్పుడు షాకిస్తుంది. ఇది సుధీర్ .. ఇమ్మాన్యుయెల్ పొట్టగొడుతున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఆడియెన్స్. అయితే చివర్లో మరోసారి సుధీర్, రష్మి కలిసి డ్యూయెట్ పాడుకోవడం ఇందులో హైలైట్ గా నిలిచింది. మరోసారి పాత రోజులను గుర్తు చేసింది. ఈ ఇద్దరు రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోవడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ `గాలోడు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన రెండు జబర్దస్త్ షోస్‌లో సందడిచేశారు. తన యూనిట్‌తో కలిసి అలరించారు. అయితే మరి షోలో కంటిన్యూ అవుతాడా? కేవలం ప్రమోషన్స్ వరకే పరిమితమా అనేది తెలియాల్సి ఉంది.