- Home
- Entertainment
- స్టేజ్‌పైనే తన లవర్ పేరు చెప్పి యాంకర్ రష్మికి సుడిగాలి సుధీర్ షాక్.. అమ్మాయి కోసం ఏకంగా జోకర్ వేషాలు
స్టేజ్‌పైనే తన లవర్ పేరు చెప్పి యాంకర్ రష్మికి సుడిగాలి సుధీర్ షాక్.. అమ్మాయి కోసం ఏకంగా జోకర్ వేషాలు
`జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌ని, యాంకర్ రష్మినీ వేరు చేసి చూడలేం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంది. కానీ ఇప్పుడు రష్మికి షాకిచ్చాడు. స్టేజ్‌పైనే తాను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు చెప్పి షాకిచ్చాడు.

`జబర్దస్త్`(Jabardasth) కమెడీయన్ సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), యాంకర్ రష్మి (Anchor Rashmi)మధ్య చాలా కాలంగా లవ్ స్టోరీ సాగుతుందనే విషయం అందరికి తెలిసిందే. రియల్ లైఫ్‌లో ఇది ఎంత వరకు నిజమనేది ఎవరికీ తెలియకపోయినా షో పరంగా వీరిద్దరు మంచి లవర్స్ అని ఆడియెన్స్, వారి అభిమానులు నమ్ముతుంటారు. ఈ జంటని షోలో కలిసి చూడాలని, జంటగా డ్యూయెట్లు పాడుకుంటే చూడాలని వెయిట్ చేస్తుంటారు. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులేస్తూ హంగామా చేస్తుంటారు.
సుధీర్-రష్మి జోడీకి ప్రత్యేకమైన అభిమానగనం ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ నాట కూడా వీరికి అభిమానులుండటం విశేషం. అంతటి క్రేజ్ వీరి సొంతం. ఆ క్రేజ్‌ని కూడా కంటిన్యూగా మెయింటేన్ చేసేందుకు `ఈటీవీ`, మల్లెమాల నిర్వహకులు కూడా ప్రత్యేకంగా స్కిట్లు ప్లాన్ చేస్తూ మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌పీ పెంచుకుంటున్నారు.
ఓ వైపు షోలో రష్మి, సుధీర్ లవ్ స్టోరీ పీక్‌లో నడుస్తుండగా, ఉన్నట్టుండి యాంకర్ రష్మికి షాకిచ్చాడు సుడిగాలి సుధీర్. తాను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు చెప్పేశాడు. తన టీం మేట్ రాంప్రసాద్‌తో తన లవర్ పేరు చెప్పి తాను తనని పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ విషయం తెలిసి రష్మి షాక్ కి గురవడం విశేషం.
సుధీర్ ప్రేమించిన అమ్మాయి పేరు `సునీత` అని చెప్పాడు సుధీర్. ఆమె తాను, సీరియస్‌గా ప్రేమించుకున్నామని, కానీ తానంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదని వాపోయాడు. అయితే అందుకు రాంప్రసాద్ ఓ ప్లాన్ చెప్పాడు. సునీత వాళ్ల తమ్ముడు(గెటప్ శ్రీను) బర్త్ డే ఉందని, అతను జోకర్ లాంటోడని, అతని ముందు నువ్వు కూడా జోకర్ లాగాచేయమని చెప్పాడు రాంప్రసాద్.
సుధీర్ సైతం జోకర్ గెటప్‌లోనే తాను ప్రేమించిన సునీత వాళ్లింటికి వెళ్లాడు. సునీత వాళ్ల తమ్ముడికి గిఫ్ట్ గా జోకర్‌ని తీసుకొచ్చానని చెప్పి సుధీర్‌ని గెటప్ శ్రీనుకి ఇవ్వగా, ఎంజాయ్ చేస్తాడు. కానీ తన అక్క చదువు విషయంలో కొట్టడంతో, నువ్వు చూస్తూ ఆపడం లేదంటూ గెటప్ శ్రీను.. సుధీర్‌ని చితకబాదగా దీనంగా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. మొత్తంగా ప్రియురాలి కోసం జోకర్‌గా మారి బకరా అయ్యాడు సుధీర్.
ప్రస్తుతం ఈసన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇది ఎక్స్ ట్రా జబర్దస్త్`లోని లేటెస్ట్ ప్రోమో కి సంబంధించిన సుధీర్ స్కిట్‌లోని సన్నివేశాలు. వచ్చే వారం శుక్రవారం టెలికాస్ట్ కాబోతున్న షో ప్రోమో యూట్యూబ్ ట్రెండ్ అవుతుంది. జోకర్‌గా సుడిగాలి సుధీర్ గెటప్ ఆకట్టుకుంటుంది.
`జబర్దస్త్` షో పరంగా సుధీర్, రష్మి లవర్స్ గా చలామణీ అవుతున్నారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం వీరిద్దరు మంచి స్నేహితులమని చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. మరి వీరిద్దరు తమ రియల్ లైఫ్‌లో ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారని మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో వీరిద్దరు కలిసి ఉంటే చూడాలని కోరుకుంటుండటం విశేషం.