MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీమియర్ రివ్యూ

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీమియర్ రివ్యూ

సుధీర్ బాబు -  కృతి శెట్టి జంటగా...  నటించిన  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈసినిమా  ఈరోజు (16 సెప్టెంబర్) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అంతకంటే ముందు యూఎస్ లో ప్రీమియర్ షో లు పడ్డాయి. మరి ఈ సినిమా ప్రీమియర్ రివ్యూ చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 16 2022, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు సుధీర్ బాబు. మంచి సినిమాలే చేస్తున్నా.. కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకూ రావడంలేదు. కథల విషయంలో సెలెక్టడ్ గా ఉంటున్న ఈ హీరో.. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ ఇంద్రగంటితో సుధీర్ బాబు ముచ్చటగా చేసిన మూడో్ సినిమా ఇది. మరి ఈ సినిమా  ఎలా ఉందంటే...?

27

ఈ సినిమా కథ విషయానికి వస్తే... హిట్ సినిమాల దర్శకుడు నవీన్ ( సుధీర్ బాబు) ..తను అనుకున్న సినిమాను తీయ్యడం కోసం డాక్టర్ కళ్యాణి ( కృతీ శెట్టిని )ఎంచుకుంటాడు. ఈ కథ  మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. తన సినిమా కోసం కృతి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తాడు. కాని ఆమె నటించడం హీరోయిన్ తల్లి తండ్రులకు ఇష్టం ఉండదు.  కాని కొన్ని కండీషన్ల మీద ఒప్పుకుంటారు. అయితే అనుకోని  ఓ సంఘటన వల్ల సుధీర్ బాబు, కృతి శెట్టి దూరమవుతారు.  అసలు కృతీ శెట్టికి ఏమౌతుంది. వాళ్లిద్దరు కలుసుకుంటారా... లేదా...? అసలు  సుధీర్ బాబు,  ఎందుకు దూరం అవుతాడు అనేది ట్విస్ట్. 

37

ఈ సినిమా కథ కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఇంద్రగండి హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ను గట్టిగా ప్లాన్ చేశాడు. ఈ ఇద్దరు స్టార్స్ కూడా ఆ సీన్స్ నుఅంతే అద్భుతంగా పండించారు. ఈ సినిమాకు కామెడీ స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అనుకోవాలి. దానితో పాటు ఇంట్రవెట్ ట్విస్ట్ అదరిపోతుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి ఈ సారి సరికొత్త సినిమా చూశామన్న ఫిలింగ్ కలిగించారు. 
 

47

ఇక ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంద్రగండి  సినిమాల్లో నేచురల్ గా కనిపించే  సాగతీద వల్ల కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనే ఫిలింగ్ కలుగుతుంది. సినిమా కాస్త స్పీడ్ గా కదిలితే బాగుండు అనిపిస్తుంది. 
 

57

ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. సుధీర్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. ఆయన ఎప్పటిలాగానే  తన పరిదిమేర నటించారు. కాకపోతే ఆయన గెటప్ ఈ సారి కాస్త కొత్తగా అనిపించింది. ఇక కృతి శెట్టితో కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు అనిపించింది. రొమాంటిక్స్ సీన్స్ కూడా అదరగొట్టాడు. ఇక కృతి శెట్టి తన నటనతో పాటు బ్యూటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.  ఇక కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, అవసరాల తదితరులు సినిమాకు కామెడీతో నింపేశారు. వారి పాత్రల పరిది మేరకు అద్భుతంగా నటించారు. 

67

డైరెక్టర్  ఇంద్రగంటి మోహన కృష్ణ ఈసారి కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు. కాని పాత వాసనలు మర్చిపోలేక పోయారు. కాని ఈ మూవీకి ఆయన  మంచి కథను అందించాడు. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు. ఇక ముఖ్యంగా ఈసినిమాకు తగ్గట్టు వివేక్ సాగర్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.  సినిమాటోగ్రఫీ పరవాలేదు అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 

77

ఇక ఓవర్ ఆల్ గా చూస్తే..  మధ్యకాలంలో వచ్చిన  సినిమాల కంటే ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. సుధీర్ బాబు ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. ఇంద్రగంటి సినిమాలు అందరూ చూసే విధంగా ఉంటాయి. ఇక ఈసినిమా కూడా ఆ జానర్ లో అలరించే అవకాశం ఉంది. కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image2
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Recommended image3
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved