- Home
- Entertainment
- నా కాపురం కూల్చింది ప్రీతి జింటానే.. ఆమెను అస్సలు క్షమించనన్న సింగర్ సుచిత్రా షాకింగ్ కామెంట్స్..
నా కాపురం కూల్చింది ప్రీతి జింటానే.. ఆమెను అస్సలు క్షమించనన్న సింగర్ సుచిత్రా షాకింగ్ కామెంట్స్..
తన జీవితంలో ఎత్తు పల్లాలు.. కష్ట నష్టాలు, తీపిచేదు విషయాలను పంచుకున్నారు పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రస్.. మల్టీటాలెంటెడ్ పర్సన్ సుచిత్రా కృష్ణమూర్తి. ఈసందర్భంగా షాకింగ్ విషయాలు ఆమె వెల్లడించారు.

బాలీవుడ్ ప్రేక్షకులకు సుచిత్రా కృష్ణమూర్తి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మంచి నటి, పాపులర్ సింగర్, బొమ్మలు అద్భుతంగా గీయగల ఆర్టిస్ట్.. ఇలా మాట్టీ టాలెంట్ చూపిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకుంది సుచిత్ర. తనకంటే మూడు పదుల వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని పెళ్లాడి సంచలనంగా మారిన ఈ బ్యూటీ.. తాజాగా తన జీవితంలో జరిగిన ఎత్తు పల్లాలు.. కష్టనష్టాల గురించి వివరంగా మాట్లాడింది.
రీసెంట్ గా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కపూర్‌ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన సుచిత్రా.. కొంత కాలానికే తన భర్తకు దూరం అయ్యింది. వీరమధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.
సుమన్ టీవీ కథనం ప్రకారం... సుచిత్రా తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నా కంటే వయసులో 30 ఏళ్లు పెద్ద.. అందులోను అప్పటికే విడాకులు తీసుకున్న వ్యక్తి అని తెలిసినా.. పెద్దవారు అందరిని ఎదురించి మరీ అతన్ని పెళ్లి చేసుకున్నా. కానీ అతని ప్రేమలో నిజాయితీ కనిపించలేదు.. అందుకే ఎక్కువ కాలం ఉండలేకపోయానుక వెంటనే దూరమయ్యాను.. అన్నారు సుచిత్రా. అంతే కాదు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు సుచిత్ర.
తమ కాపురం ఇలా అవ్వడానికి కారణం హీరోయిన్ ప్రీతి జింటా.... అంటూ షాకింగ్ విషయం చెప్పారు. అంతే కాదు ఎప్పటికీ ఆమెను క్షమించనని ఫైర్ అయ్యారు సుచిత్రా కృష్ణమూర్తి. అంతేకాదు ఈసందర్భంగా ఆమె తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేస్ చేసిన భయంకరమైన అనుభవాలను కూడా గుర్తు చేశారు.తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు. తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడి పేరు చెప్పకుండానే అసలు విషయాలు వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఆడిషన్స్ ఎక్కువగా హోటల్‌లోనే జరిగేవి. అలా నేనొక డైరెక్టర్‌ను హోటల్‌కి వెళ్లి కలిశాను. అతడు.. నువ్వు మీ అమ్మతో ఎక్కువ చనువుగా ఉంటావా?, మీ నాన్నతో క్లోజ్‌గా ఉంటావా? అని అడిగాడు. అతను ఎందుకు అలా అడుగుతున్నాడా అని నాకు ముందు అర్ధం అవ్వలేదు. కాని తరువాత అసలు విషయం తెలిసింది అన్నారు సుచిత్ర.
నేను మా నేను మా నాన్నతోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటానని చెప్పాను. అప్పుడు అతను మీనాన్నకు ఫోన్ చేసి.. రేపు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పు.. అని అన్నారు. అప్పటికే టైమ్ సాయంత్ర 5 అవుతుంది. ఆ హోటల్ లో అతను అంత తేడాగా ఆ మాట అనేసరికి నాకు వణుకుపుట్టింది. వెంటనే నా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాను అని సుచిత్రా చెప్పినట్టు కథనాలు సోషల్ మీడియాలె వెలువడ్డాయి.
అతడి మాటల్లో మీనింగ్ అర్థమై కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఏడుపొచ్చేసింది. వెంటనే నా బ్యాగ్ తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుండి పరుగెత్తుకుని వచ్చేశాను. తర్వాత ఇలా చాలా సార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇంతకన్నా దారుణమైన సంఘటనలను చాలా మంది అనుభవించారు. వారితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్న ఇన్సిడెంట్ అని చెప్పుకొచ్చారు సుచిత్రా కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.