MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • విజయవంతంగా ‘సర్కారు వారి పాట’ 100 రోజులు పూర్తి.. సెలబ్రేషన్స్ అదరగొడుతున్న మహేశ్ ఫ్యాన్స్..

విజయవంతంగా ‘సర్కారు వారి పాట’ 100 రోజులు పూర్తి.. సెలబ్రేషన్స్ అదరగొడుతున్న మహేశ్ ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సెన్సేషన్ బ్లాక్ బాస్టర్ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ను అదరగొడుతున్నారు.    

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 19 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’. ఈ ఏడాది  ఏప్రిల్ 12న సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు టాక్ మరోలా ఉన్నా.. ఆ తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అటు కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.  రూ.250  కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి తెలుగు సినిమా సత్తా చూపింది. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. 2022 తెలుగు మూవీస్ బిగ్గేస్ట్ గ్రాసర్ గా ‘సర్కారు వారి పాట’(SVP) నిలిచింది. అన్ని సెంటర్ల నుంచి మంచి వసూళ్లను కలెక్ట్ చేయడంతో ఇటు బయ్యర్లు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

36

మహేశ్ బాబు క్రేజ్, కథ సినిమాను బ్లాక్ బాస్టర్ గా నిలిచేలా చేశాయి. దీంతో ఈ చిత్రం ఏపీలో ఆయా థియేటర్లో ఇంకా ఆడుతోంది. నేటికీ 100 రోజులను పూర్తి చేసింది. ఈ సందర్భంగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, చిలుకురిపేటలో SVP ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. వంద రోజులు పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యారు. 
 

46

ఇప్పటికే  థియేటర్ల వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్లను ఏర్పాటు చేసి పూలమాల వేశారు. వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల క్రిష్ణ మరియు మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ రోజు సాయంత్రం భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున బాణా సంచాలు పేల్చడంతో పాటు, అతిథులను సత్కరించనున్నారు. వైజాగ్ లోని మౌర్య థియేటర్ లో రాత్రి సెకండ్ షోలో క్రిష్ణ, మహేశ్ బాబు పాత చిత్రాల పాటలు ప్రదర్శించనున్నారు. 

56

దర్శకుడు పరుశురాం పెట్ల - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం Sarkaru Vaari Paata. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఆడిపాడింది. 
మైత్రీ మూవీ మేకర్స్, GMBఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. 

66

‘సర్కారు వారి పాట’తో మంచి సక్సెస్ ను అందుకున్న మహేశ్ బాబు  ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘ఎస్ఎస్ఎంబీ28’ను ఈ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.  ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved