MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: 13 ఏళ్లుగా క్లాస్ మేట్ తో వ్యవహారం... స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎఫైర్ లీక్డ్?

Keerthy Suresh: 13 ఏళ్లుగా క్లాస్ మేట్ తో వ్యవహారం... స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎఫైర్ లీక్డ్?

ఈ మధ్య తరచుగా కీర్తి సురేష్ ఎఫైర్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది. క్లాస్ మేట్ ని ప్రేమించిన కీర్తి ఆయన్నే వివాహం చేసుకోబోతున్నారట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 25 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Keerthy Suresh

Keerthy Suresh

హోమ్లీ బ్యూటీపై ఎఫైర్ రూమర్స్ ఎక్కువైపోయాయి. ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. ఇటీవల ఏకంగా పెళ్లైన విజయ్ తో అంటగట్టారు. స్టార్ హీరో విజయ్ తో ఆమె లింకప్ అయ్యారని, ఇది తెలిసిన ఆయన భార్య విడాకులు సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


విజయ్ భార్యతో పాటు ఓ ఈవెంట్ కి హాజరై ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. తాజాగా ఆయనా ఈయనా కాదు కీర్తి సురేష్ లవర్ చిన్నప్పటి క్లాస్ మేట్ అంటూ వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 13 ఏళ్లుగా కీర్తి అతన్ని ప్రేమిస్తున్నారట. 

38
Keerthy Suresh

Keerthy Suresh

సదరు క్లాస్ మేట్ వ్యాపారవేత్త అట. కేరళకు చెందిన ఆ యువకుడికి రిసార్ట్స్ బిజినెస్ ఉందట. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలుసట. ఈ క్రమంలో త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందట. మూడు పదుల వయసు మీద పడిన నేపథ్యంలో పెళ్ళికి సిద్ధం అవుతున్నారట కీర్తి.

48

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ... ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇక కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు.  గత ఏడాది సర్కారు వారి పాట మూవీతో హిట్ కొట్టారు. కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ కి జంటగా నటించిన కీర్తి గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సర్కారు వారి పాట మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేయడం విశేషం.

58


ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 

68


భోళా శంకర్ తో పాటు తెలుగులో దసరా మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తుండగా వెన్నెల అనే డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. నాని సైతం దసరా మూవీలో ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. దసరా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. 

 

78
Keerthy Suresh

Keerthy Suresh

అలాగే తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు. జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.

88

తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు. కీర్తి తల్లిగారైన మేనక 80లలో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలారు. ముఖ్యంగా మలయాళంలో ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. దర్శకుడు సురేష్ ని మేనక ప్రేమ వివాహం చేసుకున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved