షాకింగ్.. స్త్రీ 2 నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్.. ఎవరు చేశారో తెలుసా
బాలీవుడ్ లో వరుస కిడ్నాప్ సంఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్ కి గురయ్యారు. కిడ్నాపర్లు సునీల్ పాల్ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. ఈ సంఘటన మరువక ముందే మరో నటుడు కిడ్నాప్ కి గురయ్యారు.
బాలీవుడ్ లో వరుస కిడ్నాప్ సంఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్ కి గురయ్యారు. కిడ్నాపర్లు సునీల్ పాల్ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. ఈ సంఘటన మరువక ముందే మరో నటుడు కిడ్నాప్ కి గురయ్యారు. స్త్రీ 2, వెల్కమ్ లాంటి చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్ ని కూడా కొందరు కిడ్నాప్ చేశారు.
ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నారు. ముస్తాన్ ఖాన్ కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఈవెంట్ మేనేజర్ స్వయంగా ఈ దారుణానికి ఒడికట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ముస్తాక్ ఖాన్ నవంబర్ 20నే కిడ్నాప్ అయ్యారట. ఢిల్లీ మీరట్ హైవేలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఆయన్ని నవంబర్ 20న కిడ్నాప్ చెసారు.
రాహుల్ సైనీ అనే వ్యక్తి ముస్తాక్ ని ఓ ఈవెంట్ కి ఆహ్వానించారట. సీనియర్ ప్రముఖలని సత్కరించే ఈవెంట్ అది. దీని కోసం ముస్తాక్ కి 50 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. కానీ మధ్యలోనే కిడ్నాప్ చేశారు. ముస్తాక్ ఖాన్ ఈవెంట్ మేనేజర్ కి ఈ కిడ్నాప్ లో హస్తం ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అతడిపై కూడా కేసు నమోదు చేశారు.
ముస్తాక్ కొడుకుని కిడ్నాపర్లు డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ 2 లక్షలు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ముస్తాక్ బిజినెస్ పార్ట్నర్ ఒకరు ఈ కేసు గురించి ప్రస్తావించారు. తన స్నేహితుడిని కిడ్నాపర్లు 12 గంటల పాటు చిత్రవధ చేసినట్లు ఆయన చెప్పారు. పోలీసులు నిందితులని తప్పకుండా శిక్షిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్ కూడా దాదాపుగా ఇలాగే జరిగిందట. డబ్బు కోసం కిడ్నాపర్లు తనని కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్లినట్లు సునీల్ పాల్ తెలిపారు. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి బంధించారు. 20 లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 10 లక్షలు అడిగారు. చివరికి తన నుంచి 7.5 లక్షలు తీసుకుని విడిచిపెట్టారు అని సునీల్ పాల్ తెలిపారు.