MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • `మోనికా` పాటకి పూజా హెగ్డే ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా? ఇంటర్నెట్‌ మొత్తం షేకింగ్‌

`మోనికా` పాటకి పూజా హెగ్డే ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా? ఇంటర్నెట్‌ మొత్తం షేకింగ్‌

రజనీకాంత్‌ హీరోగా రూపొందిన `కూలీ` సినిమాలోని పూజా హెగ్డే నటించిన `మోనికా` పాట విడుదలై దుమ్మురేపుతుంది. అయితే ఈ పాటలో నటించేందుకు పూజా ఎంత పారితోషికం తీసుకుందో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 12 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`కూలీ` నుంచి పూజా హెగ్డే `మోనికా` సాంగ్‌ రిలీజ్‌
Image Credit : Asianet News

`కూలీ` నుంచి పూజా హెగ్డే `మోనికా` సాంగ్‌ రిలీజ్‌

పూజా హెగ్డే ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె చేసిన స్పెషల్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ట్రెండ్‌ అవుతుంది. 

తెలుగు ఆడియెన్స్ ముద్దుగా బుట్టబొమ్మగా పిలుచుకునే పూజా `కూలీ` సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా నటిస్తుండగా, నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ట్రెండింగ్‌లో పూజా హెగ్డే `మోనికా` సాంగ్‌
Image Credit : youtube print shot/Gemini tv

ట్రెండింగ్‌లో పూజా హెగ్డే `మోనికా` సాంగ్‌

సన్‌ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్‌. 

వరుసగా మెయిన్‌ కాస్టింగ్‌ కి సంబంధించిన ఫస్ట్ లుక్‌లు విడుదల చేసింది. ఇప్పుడు పాటలను విడుదల చేస్తుంది. అందులో భాగంగా `కూలీ` సినిమా నుంచి `మోనికా` అనే సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు. 

ఇందులో పూజా హెగ్డే స్పెషల్‌గా స్టెప్పులేసింది. పోర్ట్ ఏరియాలో, గ్రూప్‌ డాన్స్ గా సాగే ఈ పాట ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాస్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తుంది.

Related Articles

Related image1
సావిత్రి వ్యాంప్‌ రోల్ చేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి మహానటి జీవితమే మారిపోయింది
Related image2
`కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా? 25 రెట్లు పెంపు.. యష్‌, శివరాజ్‌ కుమార్‌లు దరిదాపుల్లో కూడా లేరు
35
`మోనికా` పాటతో చర్చనీయాంశంగా పూజా హెగ్డే
Image Credit : our own

`మోనికా` పాటతో చర్చనీయాంశంగా పూజా హెగ్డే

`మోనికా` సాంగ్‌ అన్ని మాధ్యమాల్లోనూ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అదే సమయంలో పూజా హెగ్డే సైతం వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో పూజా నుంచి పెద్దగా సినిమాలు లేవు.

 ఆ మధ్య సూర్యతో నటించిన `రెట్రో` మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌ రూపంలో ఆమె చర్చనీయాంశంగా మారడం విశేషం. పూజా స్టెప్పులు మాస్‌ ఆడియెన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

అయితే ఇందులో హీరోలెవరూ కనిపించకపోవడం గమనార్హం. రజనీకాంత్‌, నాగార్జున కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ వాళ్లెవరూ ఇందులో లేరు. ఈ పాట కేవలం కమర్షియల్‌ ఎలిమెంట్ల కోసమే యాడ్‌ చేసినట్టు తెలుస్తోంది.

45
`కూలీ`లో మోనికా పాటకి పూజా హెగ్డే పారితోషికం
Image Credit : youtube print shot/Gemini tv

`కూలీ`లో మోనికా పాటకి పూజా హెగ్డే పారితోషికం

ఇదిలా ఉంటే ఈ మూవీకి పూజా హెగ్డే తీసుకున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో కేవలం ఒక్క పాట కోసం సుమారు మూడు కోట్లు తీసుకుందని తెలుస్తోంది. 

హీరోయిన్‌గా ఒక్కో మూవీకి నాలుగైదు కోట్లు తీసుకుంటుంది పూజా. కానీ ఇందులో ఒక్క పాటకే ఆ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ తీసుకోవడం గమనార్హం. `కూలీ` చిత్రం ఆగస్ట్ 14న పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్‌ కాబోతుంది.

55
పూజా హెగ్డే లేటెస్ట్ మూవీస్‌
Image Credit : youtube print shot/Gemini tv

పూజా హెగ్డే లేటెస్ట్ మూవీస్‌

పూజా హెగ్డే తెలుగులో సినిమాలు తగ్గించింది. ఇంకా చెప్పాలంటే చేయడం లేదు. ఇప్పుడు తమిళంకే పరిమితమవుతుంది. `రెట్రో` తర్వాత ప్రస్తుతం విజయ్‌ తో `జన నాయకన్‌`, `కాంచన 4` చిత్రాల్లో నటిస్తుంది. 

హిందీలో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` సినిమాలో నటిస్తుంది. పూజాకి కమ్‌ బ్యాక్‌ ఇచ్చే మూవీ ఇందులో ఏది అవుతుందో చూడాలి. తెలుగులో చివరగా `ఆచార్య`లో నటించింది పూజా. ఆ తర్వాత మరే తెలుగు మూవీకి సైన్‌ చేయలేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Recommended image2
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Recommended image3
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Related Stories
Recommended image1
సావిత్రి వ్యాంప్‌ రోల్ చేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి మహానటి జీవితమే మారిపోయింది
Recommended image2
`కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా? 25 రెట్లు పెంపు.. యష్‌, శివరాజ్‌ కుమార్‌లు దరిదాపుల్లో కూడా లేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved