MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR: జూ ఎన్టీఆర్‌ తల్లిని పిలిపించి ఎన్టీఆర్‌ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్‌

NTR: జూ ఎన్టీఆర్‌ తల్లిని పిలిపించి ఎన్టీఆర్‌ చెప్పిన మాట ఏంటో తెలుసా?.. తాతపై కోపంతో రగిలిపోయిన తారక్‌

నందమూరి తారక రామారావు పోలికలతో జన్మించిన జూ ఎన్టీఆర్ కి రామారావే స్వయంగా తన పేరుని పెట్టారు. అయితే ఆ సమయంలో తన తల్లికి, తాతకి మధ్య జరిగిన సంభాషణను తారక్‌ పంచుకున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 14 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డ్రాగన్‌తో బిజీగా ఉన్నా జూ ఎన్టీఆర్‌
Image Credit : youtube

డ్రాగన్‌తో బిజీగా ఉన్నా జూ ఎన్టీఆర్‌

నందమూరి నట వారసుడిగా రాణిస్తున్నారు జూ ఎన్టీఆర్‌. తాత స్వయంగా పెట్టిన నందమూరి తారక రామారావు పేరుతోనే ఆయన రాణిస్తున్నారు. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం తారక్‌ `డ్రాగన్‌` అనే పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీతో తానేంటో సత్తా చాటేందుకు రాబోతున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్‌ పేరు మార్చిన రామారావు
Image Credit : lokmat times

ఎన్టీఆర్‌ పేరు మార్చిన రామారావు

ఈ క్రమంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ విషయాన్ని తారక్‌ స్వయంగా వెల్లడించడం విశేషం. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జూ ఎన్టీఆర్‌ని తాత వద్దకు తీసుకెళ్లాడట హరికృష్ణ. ఆయన్ని చూడగానే రామారావు గమనించి పిలిచాడట. ఏం పేరు అని అడగ్గా తారక్‌ రామ్‌ అని చెప్పాడట. అలా కాదు, నందమూరి తారక రామారావు అని పేరు మార్చండి అని చెప్పాడట. దీంతో హరికృష్ణ అప్పట్నుంచి ఎన్టీఆర్‌గానే నామకరం చేశారట. ఆ తర్వాత నుంచి ఏడాదిపాటు తాతతోనే ట్రావెల్‌ చేసినట్టు చెప్పాడు తారక్‌. తాత, తను మాత్రమే ఉండేవాళ్లమని, తనని ఎంతో బాగా చూసుకున్నాడని, ఆ రోజులు జీవితంలో మర్చిపోలేనని తెలిపారు.

Related Articles

Related image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Related image2
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్‌.. అఖిల్‌ `లెనిన్‌` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
34
రామారావుకి జూ ఎన్టీఆర్‌ అమ్మ నుంచి క్యారేజీలు
Image Credit : ZEE5

రామారావుకి జూ ఎన్టీఆర్‌ అమ్మ నుంచి క్యారేజీలు

బ్రహ్మర్షి విశ్వామిత్ర సమయంలో ఆయన నాన్‌వెజ్‌ తినలేదు. ఆ సమయంలో తనకోసం నాన్‌వెజ్‌ ఏర్పాటు చేయించాడని, తనే స్వయంగా లేపి తినమని చెప్పాడని తెలిపారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయాన్ని జూ ఎన్టీఆర్‌ వెల్లడించారు. తాను తాతతో క్లోజ్‌ అయ్యాక తన కోసం క్యారేజీలను అమ్మ పంపించిందని, ఆ ఫుడ్‌ తిని తాత ఫిదా అయ్యాడని, అప్పట్నుంచి రోజూ అమ్మ నుంచి క్యారేజీ వచ్చేదని చెప్పాడు తారక్‌. ఈ క్రమంలో ఓ సారి అమ్మని పిలిపించాడట రామారావు. ఇద్దరు కింద కూర్చున్నారు.

44
జూ ఎన్టీఆర్ అమ్మకి రామారావు చెప్పిన మాట.. తాతపై తారక్‌కి కోపం
Image Credit : Asianet News

జూ ఎన్టీఆర్ అమ్మకి రామారావు చెప్పిన మాట.. తాతపై తారక్‌కి కోపం

`ఇంతకాలం దూరంగా ఉన్నాము, దాని గురించి మర్చిపోండి. నా వంశోద్ధారకుడు నీ కడుపు పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించమ్మ, నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను` అని అన్నాడని, అన్న కొన్ని రోజులకే తాత చనిపోయాడని చెప్పాడు తారక్‌. అప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని, అప్పుడే తనకు ధైర్యం వచ్చింది. ఉత్సాహం వచ్చింది, ఇక తనకు తిరుగులేదని భావించాను. అంతలోనే చనిపోవడంతో తాతపై చాలా కోపం వచ్చిందని తెలిపారు తారక్‌. నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పాడు, అంతలోనే అనాథగా వదిలేసి వెళ్లిపోయాడంతో కోపం తట్టుకోలేకపోయానని తెలిపారు.  కానీ పెద్దయ్యాక ఇప్పుడు అర్థమవుతుంది, నాకు కావాల్సిన మూడు అక్షరాలు `ఎన్టీఆర్‌` ఇచ్చాడు, అది చాలు నాకు అనిపించిందని చెప్పాడు తారక్‌. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో జూ ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay vs Jason Sanjay: తండ్రి విజయ్‌ కోసం కొడుకు త్యాగం.. `జననాయగన్‌`తో పోటీ నుంచి సిగ్మా డ్రాప్‌
Recommended image2
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image3
Posani: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీలో ఏం చూపించబోతున్నారో తెలుసా?.. పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌
Related Stories
Recommended image1
Bhagyashri Borse: చిన్నప్పుడు తండ్రి పడ్డ కష్టాలు పంచుకుంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్.. అప్పుడే డిసైడ్‌
Recommended image2
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్‌.. అఖిల్‌ `లెనిన్‌` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved