- Home
- Entertainment
- Sid Sriram Remuneration: పారితోషికం పెంచిన స్టార్ సింగర్.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?.. షాకే
Sid Sriram Remuneration: పారితోషికం పెంచిన స్టార్ సింగర్.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?.. షాకే
ఇటీవల కాలంల్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటూ సాధారణ ఆడియెన్స్ కి కూడా రీచ్ అవుతున్నాయి. ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. తాజాగా ఆయన పారితోషికం పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యూజిక్, సింగింగ్ విభాగంలో సునామీలా దూసుకొచ్చాడు సింగర్ సిద్ శ్రీరామ్(Sid Sriram). అనతి కాలంలోనే ఆయన స్టార్ సింగర్‌గా మారిపోయారు. ప్రతి సినిమాలో ఒక్క పాటైనా సిద్ శ్రీరామ్‌తో పాడించేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తిచూపించడం విశేషం. స్టార్ హీరోల నుంచి అప్ కమ్మింగ్ హీరోల వరకు అందరు సినిమాలకు సిద్ శ్రీరామ్ కావాల్సిందే.
అంతేకాదు Sid Sriram పాట పాడితే కచ్చితంగా అది చార్ట్ బస్టరే. యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వాల్సిందే. శ్రోతల నోట్లో నానాల్సిందే. అంతేకాదు ఫంక్షన్లలో, ఇతర ఈవెంట్లలోనూ సిద్ శ్రీరామ్ పాటలే మారుమోగుతుండటం విశేషం. వినసొంపైన గాత్రంతో అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరిస్తున్నసిద్ శ్రీరామ్‌కి డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కి తగ్గట్టుగానే పారితోషికం కూడా పెంచుతున్నారట సిద్ శ్రీరామ్.
గతేడాది వరకు ఒక్కో పాటకి సిద్ శ్రీరామ్ సుమారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు తీసుకునేవారట. కానీ కొత్తగా ఆయన రెమ్యూనరేషన్ పెంచారనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆయన ఒక్కో పాటకి ఏడు లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. యంగ్ అండ్ అప్‌కమ్మింగ్ సింగర్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే సిద్ శ్రీరామ్ ఇటీవల పాడిన మహేష్‌బాబు `సర్కారు వారి పాట`లోని `కళావతి` సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో మిలియన్స్ వ్యూస్ రాబట్టుకుంటున్న పాటగా నిలుస్తుంది. అన్ని సంగీత మాధ్యమాల్లో ఇది ట్రెండ్ అవుతుండటం విశేషం. ఆయన పాటలు కచ్చితంగా హిట్ అవుతుండటం, అవి సినిమాకి బజ్‌ని తీసుకొస్తున్న నేపథ్యంలో సిద్ శ్రీరామ్ డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదంటే అతిశయోక్తి కాదు.
సిద్ శ్రీరామ్ కర్నాటిక్ మ్యూజీషియన్, ఇండియన్-అమెరికన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పాటలు పాడుతూ అలరిస్తున్నారు. 2013లో మణిరత్నం `కాడలి` చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించారు సిద్ శ్రీరామ్. ఇందులో `యడికే` అనే పాటని ఆలపించారు. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత `ఐ` సినిమాలో `నువ్వుంటే నా జతగా` పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు.
నాని నటించిన `నిన్నుకోరి` సినిమాలో `అడిగా అడిగా` అనే పాట తెలుగులో సిద్ శ్రీరామ్‌కి గుర్తింపు తెచ్చింది. విజయ్ దేవరకొండ నటించిన `గీత గోవిందం`లో `ఇంకేం ఇంకేం కావాలే..`, `వచ్చిందమ్మా.. `పాటలో సిద్ శ్రీరామ్‌కి క్రేజ్‌ని తీసుకొచ్చాయి. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్స్ వస్తుండటంతో అనేక పాపులర్ సాంగ్స్ ని ఆలపిస్తూ స్టార్ సింగర్‌గా ఎదిగారు సిద్ శ్రీరామ్.
2017 వరకు స్ట్రగులింగ్‌తోనే సాగింది. కానీ 2018తో సిద్ శ్రీరామ్ జీవితమే మారిపోయింది. కేవలం మూడేళ్లలోనే ఆయన తెలుగులో ఆరవైకి పైగా పాటలు ఆలపించడం విశేషం. తమిళంలోనూ యాభైకిపైగానే పాటలు పాడారు. ఇలా గ్యాప్ లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలు ఆలపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అత్యంత బిజీయెస్ట్ సింగర్‌గా నిలిచారు సిద్ శ్రీరామ్. దీంతో డిమాండ్ మేరకు పారితోషికం కూడా పెంచుతూ దూసుకుపోతున్నారు.