ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే గోల్డెన్ హీరోయిన్ ఇమేజ్, శృతి హాసన్ 15 ఏళ్ల జర్నీ తెలుసా?
శృతి హాసన్ పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. వరుస పరాజయాలతో ఆమె ఒక దశలో నటనకు గుడ్ బై చెప్పే పరిస్థితి ఏర్పడింది.
Shruti Haasan
హే రామ్ మూవీలో శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 2009లో లక్ మూవీతో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారింది. హిందీ చిత్రం లక్ డిజాస్టర్. శృతి హాసన్ కి మంచి ఆరంభం లభించలేదు. లక్ మూవీలో సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి వంటి సీనియర్ హీరోలు నటించారు. లక్ పరాజయం కావడంతో శృతి హాసన్ నిరాశ చెందింది.
రెండో మూవీ అనగనగా ఓ ధీరుడు. కే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జానపద చిత్రంగా విడుదలైంది. పక్కా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ భిన్నమైన పాత్ర చేశాడు. ఈ మూవీలో మంచు లక్ష్మి విలన్ రోల్ చేయడం విశేషం. అనగనగా ఓ ధీరుడు డబుల్ డిజాస్టర్ అని చెప్పాలి. శృతి హాసన్ రెండో ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది.
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ శృతి హాసన్ కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. సూర్య హీరోగా తెరకెక్కిన సెవెన్త్ సెన్స్ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది. మురుగదాస్ చాలా కొత్త కథను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ జనాలకు ఆ మూవీ పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సెవెన్త్ సెన్స్ కూడా ఆడలేదు.
సిద్ధార్థ్ తో ఓహ్ మై ఫ్రెండ్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. అది కూడా ఫెయిల్. ధనుష్ కి జంటగా నటించిన 3 మరొక ప్లాప్. దాంతో శృతి హాసన్ కి ఐరన్ లెగ్ అనే ఇమేజ్ పడిపోయింది. ఆమె హీరోయిన్ గా చేస్తే మూవీ ప్లాప్ అనే ముద్ర పడింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఆమె ఫేట్ మార్చాడు. 2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ మూవీతో శృతి హాసన్ మొదటి హిట్ అందుకుంది. అప్పటి వరకు పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా గబ్బర్ సింగ్ కమ్ బ్యాక్ మూవీ.
గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ శృతి హాసన్ ని వద్దని అన్నాడట. ఆమె ప్లాప్స్ లో ఉంది. వేరొక హీరోయిన్ ని తీసుకుందాం అంటే... పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట. అలాంటి చెత్త సెంటిమెంట్స్ పక్క పెట్టు. శృతి హాసన్ మన మూవీలో హీరోయిన్ అన్నాడట. ఆ విధంగా గబ్బర్ సింగ్ శృతి హాసన్ ఖాతాలోకి వెళ్ళింది.
అప్పటి నుండి శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బలుపు, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి భారీ హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. 2017 తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న శృతి హాసన్ క్రాక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆమె నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. ప్రస్తుతం డెకాయిట్, టాక్సిక్ చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తుంది.