MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • NTR, కృష్ణ, చిరంజీవిలతో సంచలనాత్మక చిత్రాలు తీసిన నిర్మాత కన్నుమూత.. కారణం ఇదే

NTR, కృష్ణ, చిరంజీవిలతో సంచలనాత్మక చిత్రాలు తీసిన నిర్మాత కన్నుమూత.. కారణం ఇదే

ప్రముఖ దిగ్గజ నిర్మాత.. ఎన్టీఆర్‌, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారితో సూపర్‌ హిట్‌ మూవీస్‌ చేసిన నిర్మాత మంతెన అర్జున రాజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 14 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
  నిర్మాత ఎం అర్జున రాజు కన్నుమూత
Image Credit : Asianet News

నిర్మాత ఎం అర్జున రాజు కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత మంతెన అర్జున రాజు కన్నుమూశారు. ఎన్టీఆర్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి వారితో పలు సంచలనాత్మకమైన చిత్రాలను నిర్మించిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 80ఏళ్లు. వయోభారంతో కూడిన అనారోగ్యం కారణంగా   కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంచలనాత్మక చిత్రాలు నిర్మించిన నిర్మాత
Image Credit : prime video

సంచలనాత్మక చిత్రాలు నిర్మించిన నిర్మాత

మంతెన అర్జున రాజుకి భార్య సీతాదేవి, కొడుకు రామలింగ రాజు, కూతురు కుమారి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు(శనివారం) జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అర్జున రాజుది పశ్చిమ గోదావరి జిల్లా కోరుకొల్లు స్వస్థలం. రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన శివ రామరాజు భాగస్వామ్యంతో రోజా ఆర్ట్స్ ప్రొడక్షన్, రోజా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకాలపై ఎన్టీఆర్‌తో `వేటగాడు`(1979), `కొండవీటి సింహం` వంటి చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలను సాధించాయి. ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

34
ఎన్టీఆర్‌ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్
Image Credit : just dail

ఎన్టీఆర్‌ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్

ఎన్టీఆర్‌, శ్రీదేవి జంటగా నటించిన `వేటగాడు` చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అర్జున రాజుకిది తొలి చిత్రం. ఫస్ట్ ప్రయత్నంతోనే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్‌ చేయడంతో ఆయనకు ప్రొడక్షన్‌పై పట్టు పెరిగింది. ఆ తర్వాత 1981లో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌, శ్రీదేవి జంటగా `కొంటవీటి సింహం` చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా `అడవి సింహాలు`, శోభన్‌ బాబు హీరోగా `కోడెత్రాడు` వంటి చిత్రాలను నిర్మాణ భాగస్వామిగా నిర్మించారు. విజయాలు అందుకున్నారు.

44
చిరంజీవితో `జేబుదొంగ`తో హిట్‌
Image Credit : aha

చిరంజీవితో `జేబుదొంగ`తో హిట్‌

ఇక మెగాస్టార్‌ చిరంజీవితో `జేబుదొంగ`, నాగార్జునతో `బావ నచ్చాడు`, కృష్ణంరాజు, శ్రీకాంత్‌ హీరోలుగా `మా నాన్నకు పెళ్ళి` వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్‌ అయ్యారు. వీరితోపాటు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో `జాబిలి`, అల్లరి నరేష్‌తో `మా అల్లుడు వెరీగుడ్‌`, `జగపతిబాబుతో చేసిన `జగపతి` వంటి చిత్రాలను నిర్మించారు. ఇవి పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. తెలుగుతోపాటు హిందీలోనూ `నిషానా, ధర్మేంద్రతో `జానీ దోస్త్`, జితేంద్రతో `ఫర్జ్ ఔర్‌ కానూన్‌` వంటి సినిమాలను నిర్మించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
శోభన్ బాబు
కృష్ణ ఘట్టమనేని
కృష్ణంరాజు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Anushka Shetty: నాగార్జున చెప్పిన ఈ ఒక్క మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్న అనుష్క.. సినిమాలకు గుడ్‌ బై ఎప్పుడంటే
Recommended image2
Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved