- Home
- Entertainment
- Nysa Devgn Party Pics : కాజోల్ కూతురు నైసా దేవగన్ పార్టీ పిక్స్ వైరల్ .. అచ్చు కాజోలే అంటూ కామెంట్స్..
Nysa Devgn Party Pics : కాజోల్ కూతురు నైసా దేవగన్ పార్టీ పిక్స్ వైరల్ .. అచ్చు కాజోలే అంటూ కామెంట్స్..
కాజోల్, అజయ్ దేవ్ గన్ కూతురు నైసా దేవగన్ (Nysa Devgn) లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పార్టీకి అటెండ్ అయిన సందర్భంగా ఈ స్టార్ కిడ్ ఫొటోలకు స్టైలిష్ గా ఫోజులిచ్చింది. తన స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) హీరోయిన్ కాజోల్ (kajol) అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. వీరిద్దరి పేర్ ను బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారనేది టాక్. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపమే కూతురు నైసా దేవగన్ (Nysa Devgn).
అజయ్ దేవ్ గన్, కాజోల్ ఇద్దరు స్టార్స్ 1999లోనే ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరికి నైసా 2003లో జన్మించింది. 2010లో బాబు యుగ్ దేవ్ గణ్ కు జన్మనిచ్చారు. అయితే ఈ స్టార్ జంట ఎప్పుడూ కనిపించినా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతుంటారు. ముఖ్యంగా వీరి పిల్లలతో కనిపిస్తే హ్యాపీగా ఫీలవుతూ ఉంటారు.
ప్రస్తుతం వీరి కూతురు, స్టార్ కిడ్ నైసా దేవ్ గణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ కిడ్ అయ్యి ఉండి కూడా పలు పార్టీలకు అటెండ్ అవుతూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా కాజోల్ మరియు అజయ్ దేవగన్ ముద్దుల కూతురు నైసా దేవగన్ తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి హాజరైంది.
ఆ ఫొటోలను తన ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు నైసా అచ్చు కాజోల్ లాగే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఉన్నట్టుడి నైసా సోసల్ మీడియాలో తన మిత్రులతో ప్రత్యక్షమవడంతో ఖుషీ అవుతున్నారు.
ఈ ఫొటోల్లో నైసా దేవ్ గణ్ హైహీల్స్ ధరించి, బేబీ పింక్ శాటిన్ పొట్టి బ్యాక్‌లెస్ డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే మోడల్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసిన నైసా ఫొటోలకు మతిపోయేలా ఫోజులిచ్చింది. పార్టీ వేర్ లో కూల్ స్టిల్స్ ఇస్తూ తనవైపు ఆకర్షిస్తోంది.
ఇటీవల, నైసా FDCI X లాక్మే ఫ్యాషన్ వీక్ 2022లో కనిపించింది. మరోవైపు నైసా ఫొటోలను డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో నైసాతో పాటు దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvikapoor) కూడా ఉంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉండటం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు.
నైసా గతంలో తన తల్లి కాజోల్ లేదంటే.. తండ్రి అజయ్ దేవగన్‌తో చాలా సందర్భాల్లోనే కనిపించింది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే నైసా తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది. ఉన్నత విద్యను సింగపూర్‌లో యునైటెడ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో పూర్తి చేరింది.