MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏప్రిల్ ను టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఫూల్స్ అవుతారా..? ఫుల్ కలెక్షన్స్ సాధిస్తారా..?

ఏప్రిల్ ను టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఫూల్స్ అవుతారా..? ఫుల్ కలెక్షన్స్ సాధిస్తారా..?

2021 రేస్ నుంచి... సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న స్టార్ హీరోల సినిమాలన్నీ ఏప్రిల్ నెలను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు కుదరకపోతే అప్పుడు మాత్రం పక్కా అని తేల్చేస్తున్నాయి. ఆ నెలలోనే థియేటర్స్ కి వస్తామంటున్నాయి.కోవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈటైమ్ లో.. ఏప్రిల్ లో సినిమాలు రాగలవా..? ఫూల్స్ అయితాయా..ఫుల్ కలెక్షన్స్ సాధిస్తాయా..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 05 2022, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏప్రిల్ నెలను టార్గెట్ చేస్తున్నారు సౌత్ టు నార్త్ స్టార్స్. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలన్నీ ఏప్రిల్ నెలలోనే దూకేందుకు రెడీఅవుతున్నాయి. సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ సమ్మర్. అందులోనూ హాలీడేస్ కు ఫేమసైన ఏప్రిల్ కు ఎప్పుడూ గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు మిస్ అయిన మేకర్స్ అందరూ నెక్ట్స్ వచ్చేది ఏప్రిల్ కే అనేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు, కొవిడ్ ఆంక్షల నుంచి ఏప్రిల్ నెల వరకు రిలీఫ్ రావచ్చని అనుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సంక్రాంతి రేస్ నుంచి ఫస్ట్ తప్పుకున్న స్టార్ మహేశ్ బాబు(Mahesh babu). ఏప్రిల్ 1న సర్కారు వారి పాటను తీసుకొస్తానన్నారు.మోకాలి ప్రాబ్లమ్ తో  సర్జరీ చేయించుకున్న సూపర్ స్టార్..కాస్త గ్యాప్ తీసుకున్నాడు. సూపర్ స్టార్ త్వరలోనే మళ్లీ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మిగిలిన షెడ్యూల్ పూర్తైతే పోస్ట్ ప్రొడక్షన్ ను చకచకా పూర్తి చేస్తాడు డైరెక్టర్ పరశురామ్. ఎట్టి పరిస్థితుల్లో సర్కారు వారి పాటను ఏప్రిల్ 1న తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్.

37

నిజానికి ఏప్రిల్ నెలను ఫస్ట్ బుక్ చేసుకుంది పవర్ స్టార్ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu), గ్లోబల్ స్టార్ సలార్ సినిమాలు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా హరిహర వీరమల్లు షూటింగ్ లేట్ అయింది. క్రిష్(Krish)... స్టోరీలో మార్పులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏప్రిల్ నెలను వదిలేసిన హరిహర వీరమల్లు... జూలైకి ఫిక్సయ్యాడని టాక్.

47

అటు ప్రభాస్(Prabhas) సలార్ ప్లేస్ ను కేజీఎఫ్2తో రీప్లేస్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ బదులు ఏప్రిల్ 14న థియేటర్స్ కి రాబోతుంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2(Kgf-2). కరోనా ఇబ్బందుల నుంచి బయట పడితే..ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ లక్ష్యంగా కెజియఫ్2 ను రేసులో దింపబోతున్నారు టీమ్. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాను కరోనా ఇబ్బంది పెడితే మూడోసారి కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది.

57

ఫిబ్రవరిలో వస్తుందనుకున్న ఆమీర్(Aamer) లాల్ సింగ్ చద్దా... ఏప్రిల్ 14కు షిఫ్ట్ అయింది. నాగచైతన్య కీ క్యారెక్టర్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆంధ్రలోనూ జరిగింది. అయితే ఆమీర్ ది సేమ్ ప్రాబ్లమ్. కొవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ బాగా లేటయింది. సో ఏప్రిల్ నెలకు మారక తప్పలేదు. హాలీవుడ్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో సల్మాన్ ఖాన్ సైతం చిన్న రోల్ ప్లే చేసాడు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై బాలీవుడ్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

67

రీసెంట్ గా ఏప్రిల్ నెలలోనే వస్తున్నానంటూ ప్రకటించాడు తమిళ్ స్టార్ విజయ్(Vijay). ఈ హీరో సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోన్న బీస్ట్ సినిమాను ఏప్రిల్ నెలకే ఫిక్స్ చేసారు. న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ రిలీజ్ మ్యాటర్ రివీల్ చేసారు. నిజానికి సంక్రాంతికే రావాల్సింది విజయ్ బీస్ట్. కానీ అజిత్ వాలిమై పెద్ద పండక్కి వస్తాననడంతో విజయ్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఏప్రిల్ లో పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలిసీ ఏప్రిల్ లోరావడం ఖాయమంటున్నాడు.    

77

ఏప్రిల్ 29న మాచర్ల నియోజక వర్గం చూపిస్తానని నితిన్ ఇదివరకే చెప్పేసాడు. అయితే ఇప్పుడు సేమ్ డేట్ ఎఫ్3 రిలీజ్ చేస్తామని దిల్ రాజు అనౌన్స్ చేసాడు. మరి ఈ రెండు సినిమాలకు ఏప్రిల్ లో మోక్షం ఉంటుందో లేదో తెలియదు..ఇక  ఇవే కాదు... బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్ ధక్కడ్, మాధవన్ రాకేట్రి, టైగర్ ష్రాఫ్ హీరోపంటి2, అమితాబ్ - అజయ్ దేవగణ్ రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ గేమ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఏప్రిల్ రిలీజ్ బరిలో గెలిచేవెన్ని.. ఫూల్స్ అయ్యేవెనో  చూడాలి మరి.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth Nagothi: ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం
Recommended image3
Prabhas: 200 కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved