- Home
- Entertainment
- ఎట్టకేలకు హీరో శింబుకి పెళ్లి కుదిరిందా.. ప్రముఖ తెలుగు నటుడి కుమర్తెతో మ్యాచ్ ఫిక్స్ ?
ఎట్టకేలకు హీరో శింబుకి పెళ్లి కుదిరిందా.. ప్రముఖ తెలుగు నటుడి కుమర్తెతో మ్యాచ్ ఫిక్స్ ?
శింబు రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా గుర్తింపు పొందాడు. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు.

simbu
శింబు రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా గుర్తింపు పొందాడు. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే శింబు తరచుగా వివాదాల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటా
శింబు వయసు నాలుగు పదులు దాటింది. 41 ఏళ్ళ వయసొచ్చినా శింబు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అయితే త్వరలోనే శింబు పెళ్లి జరగబోతున్నట్లు తమిళ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి. శింబు కుటుంబ సభ్యులు సంబంధం ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అమ్మాయి చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తే అని తెలుస్తోంది.
Simbu
మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. శింబు పెళ్లి చేసుకోబోయేది ప్రముఖ తెలుగు నటుడి కుమార్తె నే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కుటుంబం ఎవరు.. ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలు బయటకి రాలేదు. దీనితో టాలీవుడ్ లో పెళ్లీడుకు వచ్చిన నటుల కుమార్తెలు ఎవరున్నారు అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టేశారు.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శింబు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మొదట ఎదురయ్యే ప్రశ్న అతడి పెళ్లి గురించే. ఇంతకాలం పెళ్లి ప్రశ్నని శింబు దాటవేస్తూ వస్తున్నాడు.
Simbu
శింబు గతంలో ప్రేమలో రెండు సార్లు విఫలం చెందిన సంగతి తెలిసిందే. మొదట నయనతారతో ప్రేమాయణం సాగించిన శింబు ఆ తర్వాత హన్సికతో వ్యవహారం సాగింది. హన్సికతో దాదాపు పెళ్లి పీటలవరకు వ్యవహారం వెళ్ళింది. ఈ విషయాన్ని శింబు తండ్రి రాజేందర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఇద్దరితో బ్రేకప్ జరిగింది.
simbu
శింబు పెళ్లి గురించి గతంలో కూడా ఊహాగానాలు వినిపించాయి. కోలీవుడ్ కి చెందిన ఒక ఫైనాన్షియర్ కుమార్తెని శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవి రూమర్స్ అని తేలిపోయాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం అవుతాయి అని కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. అంటే త్వరలోనే శింబు టాలీవుడ్ కి అల్లుడైపోతాడు అన్నమాట.