రాజమౌళి చేయాలి అనుకుని.. మధ్యలో ఆపేసిన ఆ రెండు సినిమాలు ఏంటో తెలుసా...?
ఫిల్మ్ కెరీర్ లో డైరెక్టర్ అయినా.. హీరో అయినా.. కొన్ని సినిమాలు మిస్ అవ్వక తప్పదు. కొన్ని మధ్యలో ఆపేయక తప్పదు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రాజమౌళి కూడా రెండు సినిమాలు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందట. ఇంతకీ ఎంటా సినిమాలు

ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో ఉన్నది వేరు ఇప్పుడు వేరు. ఇంతకు ముందు హీరోలు, హీరోయిన్ల కోసం మాత్రమే ఆడియన్స్ సినిమాలు చూసేవారు. ఆ క్రేజ్ ముందు హీరోలంటే ఉండేది.. ఆతరువాత హీరోయిన్ల మీద క్రేజ్ తో కూడా సినిమాలు చూసేవారు. పూర్తిగా కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఈ టైప్ ఆఫ్ క్రేజ్ లిస్ట్ లో డైరెక్టర్లు కూడా చేరిపోయారు. అందులో రాజమౌళి లాంటి దర్శకులు క్రేజ్ స్టార్ హీరోలను మించి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం డైరెక్టర్ల స్టామినాను చూసి సినిమాలకు వెళ్తున్నారు ఆడియన్స్. అదే హీరోను చూసి సినిమాకు కేవలం అభిమానులు మాత్రమే వెళతారు. కానీ దర్శకుడు రెండు మూడు హిట్లు కొట్టాడంటే చాలు ప్రేక్షకులు మూడో సినిమాకు క్యూ కడతారు. అలాంటి క్రేజ్ ఉన్న దర్శకుడే రాజమౌళి.
రాజమౌళికి పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బహుబలి సినిమాతో తనకు తాను స్టార్ డమ్ తెచ్చుకోవడంతో పాటు.. టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళాడు జక్కన్న. బాహుబలి, ట్రిపుల్ ఆర్ లతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్లుగా మార్చేశాడు.
జక్కన్న తీసిన ప్రతి సినిమాకు హిట్టే. అపజయం ఎరుగని రాజమౌళి సినిమాలు థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్ లను కురిపిస్తున్నాయి మగధీర సినిమా నుంచి రాజమౌళి దండయాత్ర మొదలయ్యింది. పక్క ఇండస్ట్రీల చూపు మనవైపు పడింది. ఇక బాహుబలితో బాలీవుడ్ ను సైతం వెనక్కి నెట్టేశారు జక్కన్న.
అయితే ఇన్ని సినిమాల నిర్విరామంగా చేస్తూ వస్తున్న రాజమౌళి రెండు సినిమాలు మాత్రం మధ్యలోనే ఆపేశాట. అసలు రాజమౌళి సినిమా స్టార్ట్ చేశారంటే ఆగే ప్రసక్తే ఉండదు. కానీ ఆయన కెరీర్ స్టార్టింగ్ లోనే జక్కన్న మొదలెట్టిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందట. ఇంతకీ ఎంటా సినిమా.
రాజమౌళి కెరియర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో స్టార్ట్ అయ్యింది. తారక్ తో స్టూడెంట్ నంబర్ 1 సినిమా తీసి ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కొట్టాడు జక్కన్న ఆ తరవాత ఆయన మోహన్ లాల్ హీరోగా ఓ మైథలాజికల్ డ్రామా తీయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందట.
ఆ తరవాత తన గురువు, టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేస్తున్న దర్శకేంద్రుడు క రాఘవేంద్రరావు వారసుడు సూర్యప్రకాష్ తో భారీ సినిమాను ప్లాన్ చేశాడట రాజమైళి. కాని భారీ బడ్జెట్ పెట్టడానికి ఎవరూ ముందుకు రాక ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా తన కెరీర్ లో చేయాలి అనుకుని అంతా రెడీ చేసుకుని ఈ రెండు సినిమాలు చేయలేకపోయారట రాజమౌళి.