ఓటమి ఎరుగని రాజమౌళికి నష్టాలు తెచ్చిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ పిల్మ్ హిస్టరీలోనే ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చకున్నాడు రాజమౌళి. ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని దర్శకుడు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రాజమౌళి పేరే. టాలీవుడ్ లోనే కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఈ టాలీవుడ్ నుంచే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు జక్కన్న.

Netflix, rajamouli
తెలుగు సినిమా పరిశ్రమకు మాత్మే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ కూడా రాజమౌళినే. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ సినిమాపై ఆధిపత్యం వహిస్తున్న హిందీ సినిమా కోరలు పీకేసి.. తెలుగు జెండా ఎగరేసిన దర్శకుడు జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్టామినాను ఇండియాకు పరిచయం చేశాడు రాజమౌళి.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు జక్కన్న. ఇక ఈ మూవీ ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడంతో ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. హాలీవుడ్ మేకర్స్ తో కూడా ప్రశంసలు పొందుతుంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక జక్కన్న చేతి నుంచి వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అది చిన్న సినిమా కాని పెద్ద సినిమా కాని హిట్టే. కాని ఒక్క సినిమాకు మత్రం నష్టాలు తప్పలేదట.
రాజమౌళి తన కెరీర్ లో తెరకెక్కించిన అన్ని సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ.. ఒక సినిమాకు మాత్రం ప్రాఫిట్ తక్కువగా వచ్చిందట. ఈ విషయం ఇప్పటి వరకూ చాలా మందికి తెలియదు. హిట్ టాక్ తెచ్చుకున్నా.. నష్టాలు తెచ్చిన సినిమా మదేదో కాదు.. నితిన్ హిరోగా వచ్చిన సై సినిమా. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
నితిన్ హీరోగా నటించిన సై సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాని స్పోర్డ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు. కాలేజీ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా.. ఎమోషనల్ టచ్ తో అందరిని ఆకట్టుకుంది సినిమా.
కానీ ఈ సినిమా విడుదల తరవాత యావరేజ్ టాక్ రావడంతో ప్రాఫిట్ తక్కువ వచ్చిందట. మంచి రెస్పాన్స్ వచ్చినా.. ఈ మూవీకి ప్రాఫిట్ చాలా తక్కువ వచ్చిందట. చిత్రం ఏంటీ అంటే..? కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా వల్ల నష్టపోయారు కూడా. సై సినిమా కోసం 5 నుండి 6 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. కానీ ఈ సినిమాకు కేవలం 9 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక ఇప్పటి వరకూ రాజమౌళి సినిమాలకు నష్టం అన్న మాట లేదు. ఆయన సినిమాలకు పెట్టిన బడ్జెట్ లో దాదాపు మూడు నాలుగు రెట్లు తగ్గకుండా వచ్చేవి. కాని సై సినిమాకు మాత్రమే.. ఇలా జరిగిందట.