మహానటి సావిత్రి ఒరేయ్ అంటూ ప్రేమగా పిలుచుకునే స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఎంత మంది హీరోయిన్లు వచ్చినా.. టాలీవుడ్ కు మహారాణి సావిత్రి మాత్రమే. అందుకే ఆమె మహానటి అయ్యింది. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె చాలా చనువుగా ఒరేయ్ తమ్ముడుఅని పిలుచుకునే స్టార్ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా..?
Savitri Gemini Ganesan
మహానటి సావిత్రి తెలుగు సినిమాకు ఒక బ్రాండ్. ఆమె మరణం తరువాత వందల మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కాని సావిత్ర స్థానం మాత్రం పదిలంగా అలానే ఉంది. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమె తెలుగుప్రేక్షకుల హృదయాల్లో మాత్రం అలా నిలిచిపోయారు. పరిశ్రమకు దొరికిన వరం సావిత్రి. ఆమె చేసిన పాత్రలు, ఆమె అందం, అభినయం.. మన ఇంటి ఆడపడుచు మాదిరి ఉండేవారు సావిత్రి.
Savitri
అయితే ఆమె ఇండస్ట్రీలో చాలామందిని ప్రేమగా వరసలతో పిలిచేవారట. సావిత్రిని కూడా సొంత కుటుంబంలో ఒకరిగా చూసుకునే తారలు చాలామంది ఉన్నారు. జమున లాంటివారిని ఇండస్ట్రీకి తీసుకువచ్చింది సావిత్రి. అందుకే అక్కయ్య అని జమున సావిత్రిని ప్రేమగా పిలిచేవారట. అయితే సావిత్రిని అక్కయ్య అని ప్రేమగా పిలిచే వ్యక్తి మరొకరు ఉన్నారు.
ఆయన ఎవరో కాదు. స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దివంగత దాసరి నారాయణ రావు. ఈ విషయాన్ని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు దాసరి. సావిత్రిని చాలా ప్రేమగా అక్కయ్య అని పిలిచేవారట. అంతే కాదు సావిత్రి కూడా ఆయన్ను ప్రేమగా తమ్మడు.. ఒరేయ్ తమ్ముడూ.. అంటూ చనువుగా పిలిచేవారట. ఆమె పిలుపులో అనురాగం కనిపించేదని దాసరి చెపుతుండేవారు. అలా ఇండస్ట్రీలీ సావిత్రి స్టార్ డైరెక్టర్ దాసరిని ఒరెయ్ అంటూ సంబోధించేవారట.
Mahanati Savitri Rare Photos
ఇక ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్టార్ దాసరి నారాయణ రావు చెప్పుకునేవారు. ఆయన బ్రతికున్న రోజుల్లో ప్రతీ ఇంటర్వ్యూల్లో దాసరి సావిత్రి గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అంతే కాదు సావిత్రి చివరిరోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ..కోమాలోకి వెళ్లి మరణించింది. ఆమె చివరి రోజుల్లో పడ్డ కష్టాలను తలుచుకుని దాసరి ఎన్నోమార్లు కంటతడి కూడా పెట్టుకున్నారు.
ఆమె ఎంతో మందికి మేలు చేసిందని. చివరకు ఆమె అన్యాయం అయిపోయారని ఆయన వాపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతో మందికి వేలకు వేలు సాయంగా అందించింది. కాని ఆమె చివరి రోజుల్లో మాత్రం ఒంటరితనంతో బాధపడింది. పలకరించేవారు లేక.. నా అన్నవారు కనపడక ఎంతో బాధపడింది. తన సాయం పొందిన వారు కూడా ఆమెను పట్టించుకోలేదు.
Savitri
చివరకు సావిత్రి మరణించిన తరువాత కూడా ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరూ చూడటానికి వెళ్ళలేదు అంటే ఎంత అన్యాయమో అర్ధం అవతుంది. ఇక సావిత్రి మరణించిందని తెలుసి వెళ్ళిన వారు టాలీవుడ్ నుంచి ముగ్గురే ముగ్గురు స్టార్స్ ఉన్నారు. అందులో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరావు, మురళీ మోహన్. ఈ ముగ్గురు మాత్రమే సావిత్రిని చూడటానికి వెళ్ళారట.