MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?

Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?

సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అందులో నిజం ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 22 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి..?
Image Credit : X

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి..?

సినిమా, క్రికెట్ కలిస్తే అక్కడ పుట్టే గాసిప్స్‌కు కొదవే ఉండదు. ఇప్పుడు కోలీవుడ్‌లో అలాంటి ఓ పెద్ద వార్తే సూపర్ ఫాస్ట్ గా  వ్యాపిస్తోంది. అది మరెవరి గురించో కాదు,  సౌత్  సినిమా 'మ్యూజిక్ సెన్సేషన్' అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 'ఐకాన్' కావ్య మారన్‌ల పెళ్లి గురించే ఈ హాట్ టాపిక్! అవును, గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి ఖాయమైపోయిందని ఇంటర్నెట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డేటింగ్ రూమర్స్ లో నిజం ఎంత?
Image Credit : X

డేటింగ్ రూమర్స్ లో నిజం ఎంత?

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఈ హై-ప్రొఫైల్ పెళ్లి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సన్ నెట్‌వర్క్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌కు, ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే అనిరుధ్‌కు మధ్య గత ఏడాదిగా ప్రేమాయణం నడుస్తోందని టాక్. వీళ్లిద్దరూ లాస్ వేగాస్‌లో కలిసి తిరిగారని, అక్కడ డిన్నర్ డేటింగ్‌కు వెళ్లారని వచ్చిన వార్తలు ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి.

Related Articles

Related image1
Sudigaali Sudheer: హీరోగా ఛాన్సుల కోసం వెళ్లి చేతులు కాల్చుకున్న సుధీర్.. చివరికి కాళ్ళు పట్టుకుని..
Related image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
35
అనిరుధ్ రియాక్షన్ ఏంటి?
Image Credit : facebook

అనిరుధ్ రియాక్షన్ ఏంటి?

సాధారణంగా అనిరుధ్ ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోడు. కానీ ఇటీవల విలేకరులు, "సార్, పెళ్లి పత్రిక ఎప్పుడు ఇస్తారు?" అని అడిగినప్పుడు, అనిరుధ్ తెలివిగా నవ్వేసి, "అది వేరే విషయం..." అని చెప్పి జారుకున్నాడు. ఇంతకుముందు పెళ్లి పుకార్లు వచ్చినప్పుడు, "కొంచెం రూమర్స్ ఆపండి బాస్" అని ట్వీట్ చేశాడు. కానీ, ఈసారి కావ్య మారన్ పేరు రావడంతో, అనిరుధ్ అంత కఠినంగా స్పందించలేదు. ఇదే అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతోంది.
45
అనిరుధ్ సంగీతం, ప్రేమ
Image Credit : Asianet News

అనిరుధ్ సంగీతం, ప్రేమ

కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు చెందిన 'సన్ పిక్చర్స్' నిర్మించే చాలా పెద్ద సినిమాలకు అనిరుధే సంగీత దర్శకుడు. రజినీకాంత్ 'జైలర్' సినిమా అయినా, రాబోయే పెద్ద ప్రాజెక్టులైనా, అనిరుధ్‌కు, మారన్ కుటుంబానికి మధ్య బలమైన వృత్తిపరమైన బంధం ఉంది. ఈ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్, ఇప్పుడు పర్సనల్ రిలేషన్‌షిప్‌గా మారబోతోందా అన్నదే అందరి ప్రశ్న.
55
రజినీకాంత్ రాయబారం నిజమేనా..?
Image Credit : Instagram

రజినీకాంత్ రాయబారం నిజమేనా..?

ఈ పెళ్లి వార్త వెనుక ఉన్న ఆసక్తికరమైన ట్విస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్! అనిరుధ్, రజినీకాంత్ భార్య లత అన్నయ్య కొడుకు, అంటే రజినీకి స్వయానా అల్లుడు. మరోవైపు, కళానిధి మారన్‌కు, రజినీకాంత్‌కు మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. అందుకే, ఈ రెండు పెద్ద కుటుంబాలను కలపడానికి, 'తలైవా'నే చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. కావ్య మారన్‌కు ఇప్పుడు 33 ఏళ్లు, అనిరుధ్‌కు 35 ఏళ్లు. వయసు, హోదా పరంగా ఈ జంట సరైన జోడీ అని అభిమానులు భావిస్తున్నారు. ఆగస్టులో ఈ రహస్యానికి తెరపడొచ్చు!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image2
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image3
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Related Stories
Recommended image1
Sudigaali Sudheer: హీరోగా ఛాన్సుల కోసం వెళ్లి చేతులు కాల్చుకున్న సుధీర్.. చివరికి కాళ్ళు పట్టుకుని..
Recommended image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved