- Home
- Entertainment
- `గుంటూరు కారం` సినిమాపై స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రివ్యూ.. మహేష్, శ్రీలీలలో ఏం చూశాడంటే?
`గుంటూరు కారం` సినిమాపై స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రివ్యూ.. మహేష్, శ్రీలీలలో ఏం చూశాడంటే?
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన `గుంటూరు కారం` సంక్రాంతికి విడుదలై ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. తాజాగా ఈ సినిమాపై స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన రివ్యూ వైరల్ అవుతుంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా `గుంటూరు కారం`. గతంలో `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబోలో `గుంటూరు కారం` మూవీ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. విపరీతమైన ట్రోలింగ్‌కి గురయ్యింది. బుక్ మై షోలోనూ దీనికి నెగటివ్ రేటింగ్ రావడం గమనార్హం.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
కానీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందన్నారు. కొన్ని చోట్ల మాత్రమే స్వల్పంగా నష్టాలు వచ్చాయని టాక్. అందులోనూ నైజాంలో ఎక్కువగా ఉందన్నారు. టాక్‌తో సంబంధం లేకుండా సంక్రాంతి సీజన్ కావడంతో అంతో ఇంతో బాగానే ఆడింది. ఓటీటీలోనూ దీనికి మంచి స్పందనే వచ్చింది. కానీ భారీ అంచనాలే సినిమాని దెబ్బకొట్టాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీపై స్టార్ క్రికెటర్, టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. తనకు సినిమా నచ్చిందన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, శ్రీలీల పర్‌ఫెర్మెన్స్, డాన్సుల గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ మేరకు ఆయన `గుంటూరు కారం` సినిమాపై ఇచ్చిన రివ్యూ వైరల్‌గా మారింది.
ఇందులో ఆయన చెబుతూ, `గుంటూరు కారంలో కొత్త మహేష్ బాబు కనిపించారు. ఇది మంచి జాలీగా, ఎంటర్‌టైనింగ్ మూవీ. శ్రీలీల డాన్సులు మాత్రం అదిరిపోయాయి. కావాలంటే మీరు యూట్యూబ్‌కి వెళ్లి శ్రీలీల గుంటూరు కారం డాన్స్ అని కొట్టి చూడండి. మహేష్ బాబు కూడా ఎక్స్ టార్డినరీ డాన్సర్ అని ఇందులో నిరూపించుకున్నారు. శ్రీలీలతో ఆయన డాన్సులు తోడు కావడంతో పాటలు మరింతగా ఊపుని తీసుకొచ్చాయి` అని తెలిపారు రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.
Guntur Kaaram
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి మరో కథానాయికగా మెరిసింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో రన్ అవుతుంది. నెక్ట్స్ మహేష్ బాబు.. రాజమౌళితో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటించబోతున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది.