- Home
- Entertainment
- Hyper Aadi: నరేష్, పవిత్ర లోకేష్ సహజీవనంపై హైపర్ ఆది పంచ్లు... మరో వివాదంలో తలదూర్చిన స్టార్ కమెడియన్!
Hyper Aadi: నరేష్, పవిత్ర లోకేష్ సహజీవనంపై హైపర్ ఆది పంచ్లు... మరో వివాదంలో తలదూర్చిన స్టార్ కమెడియన్!
మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది అదే స్థాయిలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతూ ఉంటాడు. పలు సందర్భాల్లో ఆయన వేసిన జోక్స్ కొందరు మనోభావాలను దెబ్బతీశాయి. ఇక స్వయంగా హైపర్ ఆది తన కామెంట్స్ కి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Naresh
తాజాగా హైపర్ ఆది(Hyper Aadi) మరో కాంట్రవర్సీ టాపిక్ టచ్ చేశాడు. కొన్నాళ్లుగా పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉన్న నరేష్, పవిత్రలపై తన స్కిట్స్ లో పంచెస్ వేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పటికే పలు కథనాలతో విసిగిపోయిన నరేష్ ఆది కామెంట్స్ పై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కొన్నేళ్ల క్రితం మూడవ భార్య రమ్య రఘుపతి నుండి విడిపోయిన నరేష్ కన్నడ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని నరేష్, పవిత్ర ధ్రువీకరించడం జరిగింది. ఇక వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పెళ్లి చేసుకోలేదు ప్రస్తుతానికి కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నామని నరేష్ వివరించారు.
మరోవైపు వీరి బంధాన్ని రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు. తనకు చట్టబద్ధంగా విడ్డలు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరం అంటున్నారు. అలాగే వేరే స్త్రీతో ఆయన సహజీవనం చేయడానికి నేను ఒప్పుకోను అంటున్నారు. ఇటీవల మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్ర ఉన్నారని తెలుసుకున్న రమ్య నేరుగా అక్కడకు వెళ్లి గొడవకు దిగారు. నరేష్, పవిత్రలపై చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేశారు.
ఈ వివాదం కొంచెం సద్దుమణిగినట్లు తెలుస్తున్నా నరేష్(Naresh), రమ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పెళ్లిళ్లు అఫైర్స్ తో నరేష్ మీడియాలో మారుమ్రోగడం కృష్ణ ఫ్యామిలీకి నచ్చడం లేదట. కృష్ణ నరేష్ పై అసహనంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ వివాదం ఇలా ఉంటే నరేష్, పవిత్ర లోకేష్(Pavitra Lokesh) పై హైపర్ ఆది వివాదాస్పద కామెంట్స్, సెటైర్లు వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో సీరియల్స్, కామెడీ షోస్ కి సంబంధించిన జంటలను దించారు. ఈ జంటల్లో ఒకరిని హైపర్ ఆది నీ పేరు ఏంటని అడిగాడు. అతను నరేష్ అని చెప్పాడు. ఆయన పక్కన ఉన్న జోడీ అమ్మాయి పేరు పవిత్రగా పరిచయం చేశాడు. అయితే వీడు నరేష్, ఆమె పవిత్ర... అయితే ఇంకా... అంటూ సైలెంట్ అయ్యాడు.
అక్కడ హైపర్ ఆది ఎక్స్ప్రెషన్ డబుల్ మీనింగ్ కలిగి ఉంది. నరేష్, పవిత్రలు కలిసి రొమాన్స్ చేసుకోండి అని అర్థం వచ్చేలా హైపర్ పంచ్ ఉన్న నేపథ్యంలో షోలో ఉన్నవారంతా గట్టిగా నవ్వేశారు. మరోవైపు హైపర్ ఆది సెటైర్ పై నెటిజెన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆది చివరకు నరేష్, పవిత్రను కూడా వదల్లేదని వాపోతున్నారు.
Hyper Aadi
ఇక నాగబాబు కాంపౌండ్ కి చెందిన హైపర్ ఆదికి నరేష్ అంటే ఇష్టం ఉండదు. మా ఎన్నికల సందర్భంలో నరేష్, నాగబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. నరేష్ మంచు విష్ణుకు మద్దతు ఇవ్వగా, నాగబాబు ప్రకాష్ రాజ్ కి మద్దతు ప్రకటించారు. మా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆవేశంతో మాట్లాడుతున్న విష్ణును నరేశ్ వారిస్తాడు. మీరు ఉండండి అంకుల్ అంటూ విష్ణు నరేష్ పై విసుక్కుంటాడు. ఈ సందర్భాన్ని హైపర్ ఆది తన స్కిట్స్ చేయడం విశేషం.