స్టార్ కమెడియన్ భరత్ సడెన్ గా సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా...? షాకింగ్ నిజాలు
మాస్టర్ భరత్ ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా గుండ్రంగా ఉండి చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పోకిరి, రెఢీ, ఢీ, వెంకీ, దూసుకెళ్తా, నిప్పు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాల్లో భరత్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది.

టాలీవుడ్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ గాలిలిచాడు మాస్టర్ భరత్. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు కామెడీ చేయడం అరుదు. కానీ మాస్టర్ భరత్ మాత్రం తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక మాస్టర్ భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కామెడీ సీన్స్ మీమ్స్ గా.. లేక సీన్స్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అటువంటిది భరత్ సడెన్ గా సినిమాల్లోంచి మాయమైపోయాడు ఎందుకు..?
చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. మాస్టర్ భరత్ ఏమైపోయాడు అని.. భరత్ పెరిగి పెద్దవాడైన తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా అల్లు శిరీష్ తో ఏబిసిడి సినిమాలో మంచి నటన ప్రదర్శించాడు..కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన గుర్తింపును మాత్రం పెద్దవాడు అయ్యాక తిరిగి సంపాదించుకోలేకపోయాడు. కొంతకాలంగా భరత్ అసలు సినిమాల్లోనే కనిపించడం లేదు కూడా.
అయితే భరత్ సినిమాల్లో కనిపించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. భరత్ సినిమాలు చేస్తూనే చక్కగా చదువకుంటున్నాడు. ప్రస్తుతం భరత్ మెడిసిన్ చదువుతున్నాడు. మెడిసిన్ చదవడంలో బిజీ బిజీ గా బిజీ ఉండడం వల్లే భరత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. అంతే కాదు కొన్ని విషాదాల వల్ల కూడా అతను సినిమాలకు దూరంగా ఉంటున్నాడట.
స్క్రీన్ పై ఆడియన్స్ చేత కడుపుబ్బా నవ్వించిన భరత్ లైఫ్ లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భరత్ ఎదుగుతున్న టైమ్ లో ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైమ్ లో బాగా డట్ అయ్యాడు. అంతే కాదు ఆరోగ్యం బాగోలేక బాగా సన్నబడిపోయాడు. అయినా సరే కోలుకుని సినిమాలు చేసుకుంటూన్నాడు అనకుున్న టైమ్ లో మరో ప్రమాదం అతన్ని ఇబ్బందుల పాలు చేసింది.
ఓరోజు జిమ్ చేస్తుండగా ఒక రాడ్డు అతడి కన్నుకు తగిలింది. దాంతో భరత్ కంట్లో బ్లాక్ ఏర్పడింది. దాంతో ఆ కంటి చూపుని కూడా పూర్తిగా కోల్పోయాడు. ఇలా చాలా విషయాలు అతన్ని ఇబ్బందులకు గురి చేసినవి ఉన్నాయి. ఇక భరత్ మంచి మంచి పాత్రల్లో కనిపించి మెప్పించాలని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ కోరుకుంటున్నారు.
అయితే భరత్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడా..? లేక మెడిసిన్ కంప్లీట్ చేసి.. డాక్టర్ గా సెటిల్ అవుతాడా అనేది చూడాలి. ముందు ముందు భరత్ హీరోగా కూడా ఇంటర్డ్యూస్ అవుతాడు అన్న మాటలు వినిపించాయి. మరి చూడాలి భరత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో.