- Home
- Entertainment
- యాంకరింగ్ మానేస్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన సుమ, పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ యాంకర్
యాంకరింగ్ మానేస్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన సుమ, పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ యాంకర్
చాలా రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను ఓ వార్త కలవరపెడుతుంది. స్టార్ యాంకర్ సుమ తెరకు దూరం అవుతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో రీసెంట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సుమ.

వెండితెరపై ఎంతో మంది స్టార్లు ఉన్నారు కాని.. బుల్లితెరకు మాత్రం అప్పటికీ ఇప్పటికీ యాంకర్ సుమ నే సూపర్ స్టార్.. మెగాస్టార్.. అన్నీ. చాలా మంది యాంకర్లు సుమకంటే ముందు వచ్చి వెళ్లిపోయారు.. సుమ తరువాత వచ్చినవారు కూడా చాలా మంది కనుమరుగయ్యారు.
కాని ఇప్పటికే దాదాపు 15 ఏళ్లకు పైగా నిర్విరామంగా యాంకరింగ్ తో తెగులు ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా కొనసాగుతున్న సుమ.. ఇంకో 10 ఏళ్ల వరకు కూడా నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంటుంది అనడంలో కూడా సందేహం లేదు. సినిమా ఈవెంట్ల కోసం సుమ ప్రత్యేకం.
ఆమె ఉంటే చాలు అది కూడా ప్రమోషన్ లో భాగమే అనుకునే మేకర్స్ కూడా లేకపోలేదు. చిన్న సినిమాల దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాల వరకూ.. అన్ని సినిమాలకు సుమ ఓవరంలా నలిచింది. ఈక్రమంలో సుమ యాంకరింగ్ మానేస్తుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక తన లైఫ్ ను ఫ్యామిలీకి కేటాయించబోతోంది అంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది.
అంతే కాదు సుమ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో.. సుమ రిటైర్ అయ్యి.. కొడుకు సినిమాల ఏర్పాట్లు చూసుకుంటుందంటూ కూడా వార్తలు వెలువడ్డాయి. అంతే కాదు రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ కూడా వీటికి బలం చేకూర్చింది. డిసెంబర్ 31న ఇయర్ ఎండింగ్ కోసం ఈటీవీలో ఓ షో ప్రసారం కాబోతుంది.అందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.
ఇందులో సుమ.. నేను ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా చేస్తున్నాను. కాబట్టి కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాను అంటూ ఎమోషనల్ గా డైలాగ్ చెప్పింది. ఇక దాంతో సుమ యాంకరింగ్ మానేస్తుందంటూ ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ వార్త ఆనోట ఈనోట అందరికి తెలిసింది. దాంతో ఆమె అభిమానులను ఈ వార్తలు తెగ కలవరపెట్టాయి.
ఈ ప్రోమో చూసిన సుమ స్నేహితులు, సన్నిహితులు ఆమెకు కాల్ చేసి.. ఆరా తీస్తున్నారట కూడా. అందుకే సుమ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో చేసింది. ఈ వీడియో ద్వారా ఆమె ఈ విషయం పై స్పందిస్తూ.. న్యూ ఇయర్ స్పెషల్ గా ఓ ఈవెంట్ చేశాం. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అది ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే.
అయితే ఈవెంట్ పూర్తిగా చూస్తే..అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు కంగారు పడకండి. ఇప్పటికే నాకు చాలా మంది.. ఏంటి యాంకరింగ్ మానేస్తున్నావా? అంటూ ఫోన్లు చేయడం.. మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. అది ఏంటంటే.. నేను టీవీ కోసమే పుట్టాను.. నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను.. నేను ఎటూ వెళ్లడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక నేను వెళ్లిపోవడం లేదు కాబట్టి, మీరు కంగారు పడకుండా.. హాయిగా.. హ్యాపీగా ఉండండి.. మీ అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఈ వీడియలో సరదా సరదాగా చిన్న చిన్న పంచ్ లు విసురుకుంటూ చెప్పుకొచ్చింది సుమ కనకాల. దాంతో ఆమె అభిమానులు దిల్ కుష్ అవుతున్నారు.