- Home
- Entertainment
- కొత్త షో కోసం కత్తిలా రెడీ అయిన శ్రీముఖి... టాప్ కి ఫ్రాక్ కి గ్యాప్ ఇచ్చి అది చూపిస్తూ!
కొత్త షో కోసం కత్తిలా రెడీ అయిన శ్రీముఖి... టాప్ కి ఫ్రాక్ కి గ్యాప్ ఇచ్చి అది చూపిస్తూ!
శ్రీముఖి యాంకర్ గా మరో షో ప్రారంభమైంది. స్టార్ మాలో మొదలైన 'నీతోనే డాన్స్' కొరకు సూపర్ గ్లామరస్ గా సిద్ధమైంది.

Sreemukhi
యాంకర్ శ్రీముఖి జోరు మామూలుగా లేదు. మరో కొత్త షో ఆమె ఖాతాలో చేరింది. స్టార్ మా ఛానెల్ లో 'నీతోనే డాన్స్' పేరుతో డాన్స్ రియాలిటీ షో మొదలవుతుంది. నేడు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఉంది. దాని కోసం శ్రీముఖి కత్తిలా తయారైంది. వైట్ క్రాప్ టాప్ లెహంగా ధరించి మనోహరంగా తోచింది.
Sreemukhi
టాప్ కి ఫ్రాక్ కి గ్యాప్ ఇచ్చి నడుము అందాలు ప్రదర్శించింది. శ్రీముఖి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఇక నీతోనే డాన్స్ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించనున్నారు. ప్రతి కొత్త షోకి యాంకర్ గా శ్రీముఖినే ఉంటున్నారు. బీబీ జోడి ముగిసి రెండు నెలలు కాకుండానే మరో షోని పట్టేసింది. షోల పరంగా చూస్తే ప్రస్తుతం శ్రీముఖినే నంబర్ వన్ యాంకర్. సుమ, రష్మీ కూడా ఈ విషయంలో శ్రీముఖి వెనుకే.
Sreemukhi
శ్రీముఖి కెరీర్ పరిశీలిస్తే... పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ కొంత మేర సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
Sreemukhi
బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.
Sreemukhi
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.
Sreemukhi
శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Sreemukhi
అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.