MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi: బ్యూటిఫుల్ మదర్, క్యూట్ బ్రదర్... స్టార్ యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..!

Sreemukhi: బ్యూటిఫుల్ మదర్, క్యూట్ బ్రదర్... స్టార్ యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..!

శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్నీ హాట్ గ్లామరస్ ఫోటోలే కనిపిస్తాయి. ఫ్యామిలీ ఫోటోలు శ్రీముఖి చాలా అరుదుగా పంచుకుంటారు. తాజాగా శ్రీముఖి అమ్మ, నాన్న, తమ్ముడుతో కూడిన ఫ్యామిలీ పిక్స్ షేర్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 15 2022, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె కుటుంబాన్ని చూసి అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కురచ బట్టల్లో హాట్ ఫోజుల్లో కనిపించే శ్రీముఖి చుడిదార్ సాంప్రదాయ లుక్ ఆకట్టుకుంటుంది. 
 

27
Sreemukhi

Sreemukhi

ఇక స్టార్ యాంకర్ గా శ్రీముఖి(Sreemukhi) జోరు చూపిస్తారు. అనసూయ(Anasuya), సుమ సందడి తగ్గగా శ్రీముఖి ఆధిపత్యం చలాయిస్తున్నారు. జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్ అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ కానుంది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్. 
 

37
Sreemukhi

Sreemukhi


ఇదే ఊపు కొనసాగితే సుమ మాదిరి శ్రీముఖి బుల్లితెరను ఏకఛత్రాధిపత్యం చేయడం ఖాయం. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి. 
 

47
Sreemukhi

Sreemukhi


బిగ్ బాస్(Bigg Boss) షోకి వెళ్లడం కూడా శ్రీముఖికి కలిసొచ్చింది. సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీపడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 
 

57
Sreemukhi

Sreemukhi


అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ది పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 

67
Sreemukhi

Sreemukhi


యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. 
 

77
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలైంది. అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ ఇచ్చే రోల్ కోసం శ్రీముఖి ఎదురుచూస్తున్నారు. అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved