MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Pradeep Marriage: స్టార్ యాంకర్ ప్రదీప్ పెళ్లి!... అమ్మాయి ఎవరంటే?

Anchor Pradeep Marriage: స్టార్ యాంకర్ ప్రదీప్ పెళ్లి!... అమ్మాయి ఎవరంటే?

బుల్లితెర స్టార్ ప్రదీప్ మాచిరాజు (Anchor Pradeep Machiraju) పెళ్లి వార్త ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ప్రదీప్ ప్రస్తుత వయసు 34 ఏళ్లు కాగా గత మూడు సంవత్సరాలుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో ప్రదీప్ కి స్వయంవరం కూడా జరిగింది. పెళ్లి చూపులు పేరుతో ప్రసారమైన బుల్లితెర కార్యక్రమంలో పది మందికి పైగా అమ్మాయిలు పాల్గొన్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 04 2022, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


పెళ్లి చూపులు కార్యక్రమంలో పాల్గొన్న సదరు అమ్మాయిల్లో ఒకరిని ప్రదీప్ పెళ్లి చేసుకోనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. తీరా చూస్తే ఉత్తుత్తి పెళ్లి చూపులే అని తెలిసింది. ఒకపక్క ఏజ్ బార్ అవుతున్నా ప్రదీప్ పెళ్లి మాట ఎత్తకపోవడం ఆశ్చర్యమేస్తుంది.  

27


తాజాగా ప్రదీప్ పెళ్లిపై (Anchor Pradeep Marriage)ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఆయన వివాహానికి సర్వం సిద్ధమైందట.  ప్రదీప్ పెళ్లి అనగానే అమ్మాయి ఎవరనే ఆత్రుత అభిమానుల్లో పెరిగిపోయింది. ఇక అమ్మాయి డిటైల్స్ పరిశీలిస్తే.. పేరు తెలియదు కానీ రాయలసీమకు చెందిన ఓ రాజకీయనాయకుడి కుమార్తె అట. పెద్దలు కుదిర్చిన ఈ సంబంధం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రదీప్ పెళ్ళికి చేసుకోవడానికి ఒప్పుకున్నారట. 

37


మరోవైపు ఈ పెళ్లి వార్తలపై ప్రదీప్ స్పందించకపోవడంతో ఎప్పటిలాగే ఇది గాలివాన వార్తా లేక నిజం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రదీప్ స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ దీనిపై స్పష్టత రాదు. ప్రదీప్ తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారన్నది మాత్రం నిజం. ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

47

ఇక రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ బుల్లితెర స్టార్ గా ఎదిగారు. ఆయన హోస్ట్ గా ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను బాగా సక్సెస్ అయ్యాయి. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ రియాలిటీ షో ఢీ లో ప్రదీప్ అల్లరి, కామెడీ టైమింగ్ అలరిస్తుంది.

57


యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 100% లవ్, అత్తారింటికి దారేది, జులాయి, వరుడు వంటి చిత్రాల్లో కనిపించారు. ఇక గత ఏడాది విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీతో హీరోగా కూడా మారారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

67

ఇక ప్రదీప్ జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. అలాగే పలుమార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే అవన్నీ అవాస్తవాలుగా తర్వాత నిరూపితం అయ్యాయి. ప్రస్తుతం ప్రదీప్ ఢీ షోతో పాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.

77


అలాగే హీరోగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. యాంకర్ గా హీరోలకు సమానమైన ఇమేజ్ ఆయన సొంతం. ఈ నేపథ్యంలో వెండితెరపై హీరోగా ఓ స్థాయికి చేరుకోవాలని ప్రదీప్ ప్రయత్నాలు చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Recommended image2
Dhurandhar 2 Collection: అతి పెద్ద రికార్డుకు అడుగు దూరంలో ధురంధర్ 2 , 17వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved