Standup Rahul Review: స్టాండప్ రాహుల్ ప్రీమియర్ షో టాక్
యంగ్ హీరో రాజ్ తరుణ్ క్లీన్ హిట్ కొట్టి చాలా రోజులు గడిచి పోతుంది. 2016లో విడుదలైన ఈడో రకం ఆడో రకం చిత్రం తర్వాత ఆయనకు హిట్ పడలేదు. ఈ క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ఆఫర్స్ వస్తున్నప్పటికీ సక్సెస్ దక్కడం లేదు.
దీంతో రాజ్ తరుణ్ (Raj Tarun)న్యూ ఏజ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నారు. స్టాండప్ రాహుల్ రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీగా కాగా నేడు థియేటర్స్ లో దిగింది. యూఎస్ లో ఈ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శన ముగియగా టాక్ బయటికి రావడం జరిగింది. మరి స్టాండప్ రాహుల్ మూవీ రాజ్ తరుణ్ హిట్ దాహం తీర్చిందా... లేదా అనేది చూద్దాం..
స్టాండప్ రాహుల్ (Standup Rahul)సాధారణంగా యువకులు కెరీర్ ఎంచుకునే క్రమంలో ఎదురయ్యే కన్ఫ్యూజన్స్ , కష్టాలు, అడ్డంకులు అనే అంశాల ఆధారంగా తెరకెక్కింది. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ కీలక రోల్స్ చేయగా... వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించారు.
స్టాండప్ రాహుల్ (Standup Rahul Review)కథ విషయానికి వస్తే... రాహుల్ (రాజ్ తరుణ్)కి స్టాండప్ కమెడియన్ కావాలనేది కోరిక. తల్లి ఇంద్రజ మాత్రం రిస్క్ లేకుండా చక్కగా జాబ్ చేసుకొని సెటిల్ అవ్వమని ఫోర్స్ చేస్తుంది. దీంతో వెన్నెల కిషోర్ వద్ద రాహుల్ జాబ్ లో జాయిన్ అవుతారు. అదే కంపెనీలో రాహుల్ స్కూల్ మేట్ శ్రేయ(వర్ష) పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ చిగురిస్తుంది. ఈ క్రమంలో రాహుల్ ప్రేమ, పెళ్లి, కెరీర్ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తన ప్యాషన్ అయిన స్టాండప్ కామెడీలో అతడు సక్సెస్ అయ్యాడా? ప్రేమించిన శ్రేయను దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ..
స్టాండప్ రాహుల్ ప్రీమియర్స్ చూసిన జనాలు స్పందన పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ , లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్ కామెడీతో నడిపించేశారు దర్శకుడు. కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. లవ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తుంది.
స్టాండప్ కామెడీ బేసిక్ గా చాలా కష్టం. ఒక్కడు జనాలకు ఎదురుగా నిల్చొని కామెడీ పండించడం ప్రొఫెషనల్స్ కి మాత్రమే సాధ్యం. రాజ్ తరుణ్ కి ఈ మూవీలో అదే సమస్య ఎదురైంది. ఆయన స్టాండ్ అప్ కామెడీ సీన్స్ అంతగా పండలేదన్న అభిప్రాయం వెలువడుతుంది. ప్రాధమికంగా స్టాండ్ అప్ రాహుల్ చిత్రానికి ప్రేక్షకులు యావరేజ్ మార్కులు వేస్తున్నారు.
స్టాండప్ రాహుల్ మూవీ ఫలితం తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాలి. అదే సమయంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇష్టపడేవారు, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఈ వీకెండ్ ఓ లుక్ వేయవచ్చు. స్టాండ్ అప్ రాహుల్ మనకు టైం పాస్ పంచే ఛాన్స్ కలదు.