SSMB29 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఈ సారి ప్లాన్ మార్చిన రాజమౌళి ?
మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించాల్సిన సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట.

మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో సినిమాకి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. అందుకు ఆయన భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి ముందునుంచే ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచే దీన్ని హైప్ పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ప్రారంభోత్సవమే వేదిక కానుందట.
సాధారణంగా రాజమౌళి తన సినిమాని ప్రారంభించే ముందు మీడియాతో ఇంటరాక్ట్ అవుతాడు. సినిమా విశేషాలను తెలియజేస్తాడు. టీమ్‌ని పరిచయం చేస్తాడు. తాను ఎలాంటి కథని తీయబోతున్నాడో కూడా చెబుతాడు. అందులోని డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లారిటీ ఇస్తాడు. ఎంత వరకు చెప్పాలో అంత చెప్పి సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ని సస్పెన్స్ లో పెట్టి దాని చుట్టూ చర్చ జరిగేలా చేస్తారు.
అయితే ఈ సారి మాత్రం `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమాని చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఆ మధ్య ఇంటర్నేషన్ మీడియా సమక్షంలో ఈ మూవీ ప్రకటన ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. సినిమా ప్రారంభోత్సవం రోజునే ప్రకటన ఉంటుందని సమాచారం. భారీ సెట్ వేసి అందులో ప్రారంభోత్సవం చేస్తారట. అదే సమయంలో సినిమాని ప్రకటిస్తూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతారట. అప్పుడే సినిమా విశేషాలను తెలియజేస్తారట.
అయితే తాజాగా అందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు సంవత్సరం ఉగాది రోజున ఈ ప్రారంభోత్సవం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. చాలా గ్రాండియర్‌గా సెట్ వేసి, అందులోనే ప్రారంభోత్సవం చేసి, ఇండియన్ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ఈ ఓపెనింగ్ ఈవెంట్‌ని చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. కొంత గ్యాప్‌తో రెగ్యూలర్ షూటింగ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
`ఎస్‌ఎస్‌ఎంబీ29` కోసం మహేష్‌బాబు ఇప్పటికే వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. మేకోవర్ చేస్తున్నారు. ఇటీవల కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతోపాటు ఆయనపై లుక్ టెస్ట్ కూడా చేశారట. అందులో ఎనిమిది లుక్స్ ని ఫైనల్ చేశారట. అందులో ది బెస్ట్ ఒకదాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఆ లుక్‌లోనే మహేష్ కనిపిస్తారని తెలుస్తుంది.
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు గా మహేష్, రాజమౌళి చిత్రం ఉండబోతోంది. దాదాపు వెయ్యి కోట్లతో కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు సరసన ఇండోనేషియ నటి చెలేసా ఇస్లాన్ నటిస్తుందని టాక్. అలాగే నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో సాహసికుడి కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట జక్కన్న.