- Home
- Entertainment
- తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఎస్ఎస్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎప్పుడు ప్రారంభం కాబోతుందో చెప్పిన జక్కన్న
తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఎస్ఎస్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎప్పుడు ప్రారంభం కాబోతుందో చెప్పిన జక్కన్న
22 ఏండ్లుగా టాలీవుడ్ ను ఏలుతున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఫ్లాప్ ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆయన. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన జక్కన్న.. తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 22 ఏండ్ల ఏండ్ల రాజమౌళి సినీ ప్రస్థానంలో ఒక ప్లాప్ ఎరుగని దర్శకుడు ఆయన. సినిమా సినిమాకు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ పోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బాహుబలి’ని (Baahubali) చిత్రీకరించి ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ సత్తాను చూపించారు. తెలుగు సినిమాపై ఆదరణ పెరిగేలా చేశాడు. ఆయన దర్శక ప్రతిభనూ వరల్డ్ వైడ్ తెలియజేశాడు.
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను తెరకెక్కించిన విషయం తెలిపిందే. ఈ చిత్రం కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.1200 కోట్లను రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా హయ్యేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ‘బాహుబలి’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ‘స్టూడెంట్ నెంబర్ వన్’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేస్తూ.. ఇండియన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ ఛాప్టర్ ముగియడంతో రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషనల్ లో రూపుదిద్దుకోనున్న మెగా ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా స్వయంగా రాజమౌళినే చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుందని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మెగా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకా నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ తర్వాతే తన డ్రీమ్ ఫిల్మ్ Mahabharatham ను డైరెక్ట్ చేస్తానని తెలిపారు. అయితే ఈ సినిమా సరిగ్గా ఎప్పుడు ప్రారంభం కానుందనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నారు.
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో టాలీవుడ్, బాలీవుడ్ అగ్రస్థాయి కథనాయకులు నటించనున్నారని గతంలోనే ప్రకటించారు. ఆ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ హ్రుతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, ఇటు సౌత్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, తదితరులు నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ రాజమౌళి కనీసం ఏడాదికో సినిమా అయినా తీసే రోజులు పోవడంతో.. ‘మహాభారతం’ వచ్చేదెప్పటికోనని అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు.
ఇప్పటికే ఇండియన్ సినిమా సత్తాను వరల్డ్ బాక్సాఫీస్ వద్ద చూపించిన రాజమౌళి.. మున్ముందు కూడా తన సినిమాల ద్వారా ఇండియన్ స్టోరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతానని కూడా వాగ్దానం చేస్తున్నారు. ఇక మహేశ్ బాబు డైరెక్ట్ చేయనున్న రాజమౌళి.. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం కథను ఆఫ్రికన్ అడవులలో సెట్ చేసినట్టు తెలుస్తోంది.