MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

Rajamouli Remuneration: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు వందల, వేల కోట్లు వసూలు చేస్తుంటాయి. అంత భారీ సినిమాలు చేసే జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రికార్డుల రారాజు రాజమౌళి..
Image Credit : Asianet News

రికార్డుల రారాజు రాజమౌళి..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తుంది. జక్కన్నతో సినిమా అంటే నిర్మాతలకు కాసుల పంట పండినట్టె. మరి వారికి అంత లాభాలు తీసుకువచ్చే రాజమౌళి సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తన రెమ్యునరేషన్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో రాజమౌళి తన రెమ్యునరేషన్ విధానం, మొదటి పాన్ ఇండియా మూవీ బాహుబలి కోసం ఎంత తీసుకున్నడన్నది వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోని జక్కన్న!
Image Credit : Asianet News

ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోని జక్కన్న!

తెలుగు చిత్రసీమలో చాలామంది దర్శకులు ముందుగానే భారీ పారితోషికం అడ్వాన్స్‌గా తీసుకుంటారు. కానీ రాజమౌళి విధానం దానికి భిన్నంగా ఉంటుంది. ఆయన ముందుగా ఎటువంటి భారీ రెమ్యునరేషన్ ఆశించకుండా, సినిమా లాభాల్లో వాటా (ప్రోఫిట్ షేరింగ్) పద్ధతిని పాటిస్తారు. సినిమా విజయం సాధించినప్పుడే నిర్మాతల నుంచి తన వాటాను తీసుకుంటారు. అది భారీగా ఉండొచ్చు.. తక్కువ ఉండొచ్చు. ఇంత అని మాత్రం చెప్పలేము. కొన్ని సినిమాలకు తాను పెద్దగా తీసుకున్నది లేదని, ఖర్చుల కోసం మాత్రమే తీసుకున్నట్టు రాజమౌళి అన్నారు.

Related Articles

Related image1
Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?
Related image2
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
35
'బాహుబలి' కోసం ఎంత తీసుకున్నారు? వారణాసికి ఎంత?
Image Credit : Surya Rejected Baahubali

'బాహుబలి' కోసం ఎంత తీసుకున్నారు? వారణాసికి ఎంత?

విశ్వవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన 'బాహుబలి' సిరీస్ కోసం రాజమౌళి ఎంత తీసుకున్నారనేది ఆసక్తికరం. రాజమౌళి ఈ సినిమాకు నేరుగా ఫిక్స్డ్ పారితోషికం కాకుండా, లాభాల్లో పర్సంటేజ్ రూపంలోనే భారీ మొత్తాన్ని అందుకున్నారు. సినిమా విజయంపై ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ పూర్తికావడానికి పట్టిన నాలుగైదేళ్ల కాలంలో ప్రాజెక్ట్ బడ్జెట్‌ను ఇబ్బంది పెట్టకుండా కేవలం లాభాల్లోనే తగిన వాటా పొందేలా ఒప్పందం చేసుకున్నారు. 

ఇక వారణాసి విషయంలో కూడా అంతే జరుగుతున్నట్టు సమాచారం. బాహుబలి టైమ్ లో ఆయన తీసుకున్నది పెద్దగా లేదని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక త్రిపుల్ ఆర్ కు భారీగా లాభం పొందినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన వారణాసి అనుకున్నట్టు హిట్ అయితే.. జక్కన్న తిరుగులేని డైరెక్టర్ అవ్వడమే కాదు.. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగా పేరు తెచ్చుకోవడం పక్కా.

45
నిర్మాతలను మార్చకపోవడానికి అసలు కారణం?
Image Credit : SS Rajamouli\Twitter

నిర్మాతలను మార్చకపోవడానికి అసలు కారణం?

రాజమౌళి ఒకే నిర్మాతతో లేదా తన నమ్మకమైన నిర్మాతలకే వరుసగా అవకాశాలు ఇస్తుంటారని పరిశ్రమలో టాక్ ఉంది. దానికి ప్రధాన కారణం పరస్పర నమ్మకం  అవగాహన. భారీ బడ్జెట్ చిత్రాలు తీసేటప్పుడు దర్శకుడు-నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం, నమ్మకం చాలా ముఖ్యం. నిర్మాతలు రాజమౌళి విజన్, కాన్సెప్ట్‌ను నమ్మి ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధపడతారు. రాజమౌళికి నిర్మాతలు పూర్తి స్థాయిలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారు. సెట్స్‌లో రాజమౌళికి ఉన్న క్లారిటీ, కష్టపడే తత్వం చూసి నిర్మాతలు కథ విషయంలో గానీ, మేకింగ్ విషయంలో గానీ జోక్యం చేసుకోరు. ఈ రకమైన ఆరోగ్యకరమైన పని వాతావరణం దక్కడం వల్లే ఆయన పాత నిర్మాతలతోనే మళ్లీ మళ్లీ పనిచేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.

55
రాజమౌళి అసలు బలం ఎవరంటే?
Image Credit : youtube/@ScreenRantPlus

రాజమౌళి అసలు బలం ఎవరంటే?

సినిమా నిర్మాణం సమయంలో ప్రతి రూపాయి ఎక్కడ, ఎలా ఖర్చు అవుతోందనే విషయమై రాజమౌళి అత్యంత పారదర్శకతను పాటిస్తారు. లెక్కలు పక్కాగా ఉండటం వల్ల నిర్మాతలకు, ఆయనకు మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తవు. అకౌంటింగ్, బడ్జెటింగ్ స్పష్టంగా ఉండటమే నిర్మాతలు రాజమౌళితో సుదీర్ఘకాలం ప్రయాణం చేయడానికి మరో ముఖ్య కారణం. 

ఇక రాజమౌళి సినిమాల్లో ఆయన కుటుంబ సభ్యులు కీరవాణి, వల్లీ, రమా రాజమౌళి, కార్తికేయ కీలక భాగాలు పంచుకుంటారు. వారే ఆయనకు బలం. అలాగే నిర్మాతలు కూడా రాజమౌళి కుటుంబంలో భాగమైనట్లే కలిసిపోతారు. ఈ అనుబంధం సినిమా అపుట్ పుట్ అద్భుతంగా రాడానికి ఉపయోగపడుతుంది. కేవలం డబ్బు కోసం కాకుండా, సినిమా విజయం , మేకింగ్ నాణ్యత పైనే రాజమౌళి దృష్టి పెడతారు. అందుకే భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లగలుగుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?
Recommended image2
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved