అడివి శేష్ కి బిగ్ షాక్..'డెకాయిట్' మూవీ నుంచి శృతి హాసన్ అవుట్, ఎందుకంటే
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరగా తెలుగులో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్.. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలి చిత్రంలో నటిస్తోంది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరగా తెలుగులో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్.. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలి చిత్రంలో నటిస్తోంది. తెలుగులో కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే శృతి హాసన్ తాజాగా టాలీవుడ్ హీరోకి బిగ్ షాక్ ఇచ్చింది. శృతి హాసన్, అడివి శేష్ జంటగా డెకాయిట్ అనే చిత్రం గత ఏడాది మొదలయింది. టీజర్ కూడానా రిలీజ్ చేశారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఈ చిత్రం నుంచి ఉన్నపళంగా శృతి హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ నుంచి ఆమె బయటకి వచ్చేసిందట. పూర్తి స్థాయిలో కారణాలు తెలియవు కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల శృతి హాసన్ తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆమె పాత్ర తెరకెక్కిస్తున్న విధానం నచ్చలేదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా డెకాయిట్ చిత్రం నుంచి శృతి హాసన్ తప్పుకోవడం అయితే కన్ఫర్మ్.
మరోవైపు ఆమె చెన్నై స్టోరీ అనే చిత్రం నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ ఒకేసారి రెండు చిత్రాల నుంచి ఎందుకు తప్పుకుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం రజనీకాంత్ కూలి మూవీ.