- Home
- Entertainment
- Anirudh Marriage: గ్రాండ్ గా అనిరుధ్, కావ్య మారన్ వివాహం, గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వేడుక!
Anirudh Marriage: గ్రాండ్ గా అనిరుధ్, కావ్య మారన్ వివాహం, గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వేడుక!
Anirudh Marriage: సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ , కావ్య మారన్ వివాహ వేడుకలు గ్రీస్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలో సినీరాజకీయ ప్రముఖులు హాజరయినట్టు తెలుస్తోంది.

గ్రాండ్ గా అనిరుధ్, కావ్య మారన్ వివాహం
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోో తన అద్భుతమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కాళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సీఈఓ కావ్య మారన్ తో ఆయన వివాహం గ్రీస్ దేశంలో అత్యంత కనులపండువగా జరిగినట్లు సమాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే కొద్ది రోజుల క్రితం గ్రీస్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.
గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వేడుక
ఈ వివాహ వేడుకకు సినిమా రంగానికి చెందిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక అతిథులుగా హాజరైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ వేడుకను అత్యంత గోప్యంగా నిర్వహించారు. దీనివల్ల వివాహ వేడుకకు సంబంధించిన అధికారిక ఫోటోలు లేదా వీడియోలు ఏవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఈ వివాహం గురించిన వార్తలు దేశవ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
AI వీడియోల హల్చల్
అనిరుధ్ , కావ్య మారన్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో, ఇంటర్నెట్లో ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో గ్రీస్ దేశంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుంటున్నట్లుగా ఉండటంతో, చాలామంది నెటిజన్లు అదే నిజమైన నిశ్చితార్థ వీడియో అని నమ్మి పొరబడ్డారు. అయితే, ఆ వీడియో పూర్తిగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఎవరో సృష్టించిన నకిలీ వీడియో అని తెలుస్తోంది. ఈవీడియో నిజమని నమ్మి ఎంతోమంది అభిమానులు కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.













