Medha : నటుడు శ్రీకాంత్ కూతురిని ఎప్పుడైనా చూశారా.? త్వరలో హీరోయిన్ గా.!
తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటుడు శ్రీకాంత్. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన లాగే తన కూతురు కూడా త్వరలో సినిమాల్లో మెరియనుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్‌కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని 100కు పైగా సినిమాలు చేసాడు శ్రీకాంత్. అయితే తాజాగా శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొన్నేండ్లుగా హీరోగా మెప్పించిన శ్రీకాంత్... ప్రస్తుతం తన కేరీర్ గ్రోత్ కోసం రూట్ మార్చాడు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే... ఇటు విలన్ గానూ మెప్పిస్తున్నారు. ఇటీవల రిలీజై సెన్సెషన్ క్రియేట్ చేసిన ‘అఖండ’ మూవీలో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురిచేశారు. కాగా ఫిబ్రవరి 4న శ్రీకాంత్ కథానాయకుడిగా ‘కోతల రాయుడు’ మూవీ రిలీజైంది.
శ్రీకాంత్ కు 1997లో ఊహతో వివాహామైంది. గతనెల జనవరి 20న వీరి 25వ వివాహా వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన ఫ్యామిలీతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా పలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలో భార్య ఊహ, కొడుకు రోషన్, రోహన్, కూతురు మేధా ఉన్నారు.
ఇప్పటికే రోషన్ ‘పెళ్లి సందడి’ సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విషయం మాత్రం కూతురు మేధ. ఈమెను చూసిన వాళ్లెవరైనా షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే హీరోయిన్లు కూడా ఈమె బ్యూటీ ముందు తగ్గాల్సిందే. ఊహకందని అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది మేధ.
మేధా కూడా ఇప్పటికే ‘రుద్రమాదేవి’ సిరియల్ లో బాల్య రుద్రమాదేవిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మేధా కూడా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు నెట్టింట కూడా చర్చ కొనసాగుతోంది. మరోవైపు నేడో రేపో మేధా కూడా సినిమాలో మెరియనుందని భావిస్తున్నారు.
ఇక కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంటే.. రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో బిజీగా ఉంది. మేధా కూడా అదే పథంలో పయనిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.