- Home
- Entertainment
- Pedakapu1 Review: పెదకాపు 1 ప్రీమియర్ టాక్.. విజువల్స్ టాప్ లెవల్..కానీ అసలైన లోపం అదే, గోల్డెన్ ఛాన్స్ మిస్
Pedakapu1 Review: పెదకాపు 1 ప్రీమియర్ టాక్.. విజువల్స్ టాప్ లెవల్..కానీ అసలైన లోపం అదే, గోల్డెన్ ఛాన్స్ మిస్
శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని రూపొందించారు.ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం పెదకాపు 1నేడు రిలీజ్ అవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతంగా ఆకర్షించేవి. తిరిగి వెంకటేష్ నారప్ప చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించే ఆయన నారప్ప లాంటి రా అండ్ రస్టిక్ మాస్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల మరో సంచలన చిత్రానికి తెరలేపారు. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం పెదకాపు 1నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్స్, టీజర్స్ చాలా ఇంటెన్స్ గా క్రేజీ విజువల్స్ తో ఉండడంతో పెదకాపు 1పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్స్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి పెదకాపు 1 చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం.
1982 నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆసక్తికర సన్నివేశంతో విరాట్ ఎంట్రీ ఇస్తాడు. పెదకాపు 1 చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రెండు పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతన్న సంఘర్షణగా చూపించారు. ఇందులో హీరో ఒక పార్టీకి చెందిన వాడు. ఫస్ట్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ, బిజియం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాకి ప్రధాన ఆకర్షణ అంటే ఇదే.
కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథని చెప్పే విధానంలో తడబడ్డారు. స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా లేకపోగా.. కన్ఫ్యూజ్ చేస్తోంది. విజువల్స్, రెండు మూడు ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు మినహా ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ లేవు. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ అడ్డాల సెట్ చేసుకున్న సెటప్, నటీనటుల నుంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్న విధానం అభినందనీయమే.
కానీ కథలో క్లారిటీ లేకుండా ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అనే కన్ఫ్యూషన్ తో చిత్రం సాగుతూ ఉంటుంది. నటీనటుల పెర్ఫామెన్స్ వల్ల కొంతవరకు ఈ చిత్రం ఆడియన్స్ ని హోల్డ్ చేస్తుంది. టెక్నీకల్ అంశాలు కూడా బావున్నాయి కానీ కొరవడింది కథ, స్క్రీన్ ప్లే అని ప్రేక్షకులు అంటున్నారు.
కథలో ఎమోషన్ పండక పోవడంతో నటీనటులు ఎంతగా పెర్ఫామ్ చేసినా వర్కౌట్ కాలేదు. ముందు వచ్చే సన్నివేశానికి ఆ తర్వాత వచ్చే సీన్ కి కనెక్టివిటీ లేదు. దీనితో ఆడియన్స్ కన్ఫ్యూషన్ డ్రామాగా ఫీల్ అవుతున్నారు. భారీగా అంచనాలు ఉన్న స్థాయిలో అయితే ఈ చిత్రం వర్కౌట్ కావడం కష్టమే అని అంటున్నారు.
విజువల్స్ మాత్రం టాప్ లెవల్ లో ఉంటాయి. రూరల్ సెటప్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఆసక్తికరంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. కానీ కథ స్క్రీన్ ప్లే బాగా ఉండిఉంటే చిత్రం పై ఉన్న అంచనాలకు నెక్స్ట్ లెవల్ కి వెళ్లి ఉండేది. శ్రీకాంత్ అడ్డాల ఛాన్స్ మిస్ చేసుకున్నారు అని అంటున్నారు. ఓవరాల్ గా పెదకాపు 1 మూవీ బిలో యావరేజ్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.