250 కోట్ల ఆస్తిని 2 ఏళ్ల కూతురికి రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత పేరెంట్స్ ఆస్తులు పంచడం కామన్ గా జరిగేదే, కాని ఇక్కడ తన ఏకైక కూతురికి 2 ఏళ్లు నిండకుండానే 250 కోట్ల ఆస్తిని రాసి ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఇలా చేశాడు.

తల్లీ తండ్రుల ఆస్తులు బిడ్డలకు రావడం సహజం. పిల్లలు అడక్కుండానే వారికి ముందే ఆస్తులను రాసిచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. కాని ఇదంతా వారు పెద్దైన తరువాత జరుగుతుంది. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ ఫ్యామిలీ వారసుడైన యంగ్ హీరో.. తన రెండేళ్ల కూతురికి 250 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు. అతను అలా ఎందుకు చేశాడు? ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు రణ్ బీర్ కపూర్.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తమ కుమార్తె రాహా కపూర్ కి సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయింది. 2022 నవంబర్‌లో జన్మించిన రాహా ఇప్పుడు కేవలం రెండేళ్ల వయస్సులోనే రూ. 250 కోట్ల విలువైన ఆస్తికి వారసురాలైంది.
ముంబై నగరంలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో వీరికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ ఏకంగా 250 కోట్లు. ఈ ఆస్తి మొదటగా రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్, తర్వాత రణబీర్ కపూర్ కి వారసత్వంగా వచ్చింది. గత సంవత్సరంలో ఈ బిల్డింగ్‌ను రణబీర్ పూర్తిగా రీ మోడలింగ్ చేయించారు. ఇది ఆరు అంతస్థుల లగ్జరీ బిల్డింగ్‌గా మారింది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన ఈ భవనంలో అన్ని వసతులు ఉండేలా రూపొందించబడింది.
తాజా సమాచారం ప్రకారం, రణబీర్ – ఆలియా దంపతులు ఈ ఇంటిని తమ కుమార్తె రాహా కపూర్ పేరు మీద అధికారికంగా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రక్రియలు ఇటీవల పూర్తయ్యాయని సమాచారం. దీంతో బాలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాహా కపూర్ పేరు మీద ఇంత భారీ ఆస్తి రాయడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక త్వరలో ఈ ఇంటిలోకి రణ్ బీర్ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. ఈరకంగా బాలీవుడ్ కుటుంబాల్లో చిన్న వయసులో భారీ ఆస్తికి యజమానిగా మారిన స్టార్ వారసురాలిగా రాహా రికార్డ్ క్రియేట్ చేసింది.