- Home
- Entertainment
- జయప్రద , శ్రీదేవి తో పాటు.. తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
జయప్రద , శ్రీదేవి తో పాటు.. తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్లు గా నిరూపించుకున్నారు కొంత మంది తారలు. స్టార్ హీరోలతో ఆడి పాడిన నటీమణులు.. ఆతరువాత కాలంలో వారి కొడుకులతో కూడా సందడి చేశారు.

తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు
ఫిల్మ్ ఇండస్ట్రీలోరెండు తరాల హీరోలతో కలిసి నటించి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఆన్ స్క్రీన్ పై తండ్రీ కొడుకులతో డ్యూయెట్లు పాడి, రొమాన్స్ చేసి ఆశ్చర్యపరిచాయరు. జయప్రద, శ్రీదేవి నుంచి శిల్పా శెట్టి వరకూ.. తండ్రీ కొడుకులతో నటించిన హీరోయిన్లు ఎవరెవరంటే?
శ్రీదేవి
స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి టాలీవుడ్ లో బాలీవుడ్ లలో తండ్రీ కొడుకులతో నటించి మెప్పించింది. తెలుగులో అక్కినేని నాగేశ్వరావు తో నటించిన ఆమె.. ఆయన తనయడు నాగార్జునతో కూడా రొమాన్స్ చేసింది. ఇక బాలీవుడ్ లో 1990లో 'నాకాబంధి' సినిమాలో ధర్మేంద్రతో నటించింది. 1989లో 'చాల్ బాజ్' సినిమాలో సన్నీ డియోల్‌తో రొమాన్స్ చేసింది.
జయప్రద
తెలుగు సినిమాలతో స్టార్ గా మారిన జయప్రద ఆతరువాత కాలంలో బాలీవుడ్ లో సత్తా చాటింది. జయప్రద 1991లో 'ఫరిస్తే' సినిమాలో ధర్మేంద్రతో నటించింది. 1993లో 'వీర్తా' సినిమాలో సన్నీ డియోల్‌తో నటించింది.
మాధురి దీక్షిత్
మాధురి దీక్షిత్ అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె 1988లో 'దయావాన్' సినిమాలో వినోద్ ఖన్నాతో రొమాన్స్ చేసింది. పదేళ్ల తర్వాత అతని కొడుకు అక్షయ్ ఖన్నాతో 'మొహబ్బత్' సినిమాలో డ్యూయెట్ పాడింది.
శిల్పా శెట్టి
ఎవర్ గ్రీన్ బ్యూటీ శిల్పా శెట్టి 1999లో అమితాబ్ బచ్చన్‌తో 'లాల్ బాద్‌షా' సినిమాలో నటించింది. 2008లో 'దోస్తానా' సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో రొమాన్స్ చేసింది.
హేమా మాలిని
డ్రీమ్ గర్ల్ హేమా మాలిని 1968లో 'సప్నో కా సౌదాగర్' సినిమాలో రాజ్ కపూర్‌తో నటించింది. తర్వాత 1981లో 'ఏక్ చాదర్ మైలీ సి' సినిమాలో రిషి కపూర్‌తో కలిసి నటించి మెప్పించింది.
డింపుల్ కపాడియా
నటి డింపుల్ కపాడియా 1991లో 'ఖూన్ కా ఖర్జా' చిత్రంలో వినోద్ ఖన్నాతో డ్యూయెట్ పాడింది. 'దిల్ చాహ్తా హై' సినిమాలో అక్షయ్ ఖన్నాతో కూడా డింపుల్ నటించింది.

