- Home
- Entertainment
- Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
ప్రస్తుతం సినిమాల్లో కిస్ లు, ఘాటు రొమాంటిక్ సీన్లు కామన్ అయిపోయాయి.. కానీ ఒకప్పుడు హీరోయిన్లు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఓసారి ముద్దు సీన్ విషయంలో.. కోర్డు వరకూ వెళ్లింది అతిలోక సుందరి శ్రీదేవి. ఇంతకీ ఏం జరిగిందంటే?

రొమాంటిక్ సీన్లు కామన్
ప్రస్తుతం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు కామన్ అయిపోయాయి. ఎంత పద్దతిగల సినిమా అయినా.. ఒక్కటైనా ఆ.. సీన్ ఉండాల్సిందే. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు రేర్ గా ఉండేవి. అది కూడా హీరోయిన్ ఒప్పుకుంటేనే.. దర్శకులు పెట్టేవారు. వారి పర్మీషన్ లేకుండా ఇలాంటి సన్నివేశాలకు సాహసం చేసేవారు కాదు. కానీ ఓ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవికి తెలియకుండానే ఆమె కిస్ సీన్ ను తీసి.. సినిమాలో పెట్టేశాడట దర్శకుడు. అసలు అది ఎలా సాధ్యం అయ్యింది. ఈ విషయంలో శ్రీదేవి ఏం చేసిందో తెలుసా?
శ్రీదేవి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుతెచ్చుకుంది శ్రీదేవి. తన నటన, బ్యూటీ తో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆమె.. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు.
విలువల విషయంలో ఎప్పుడూ రాజీపడని నటి గా శ్రీదేవి గుర్తింపు పొందింది. హీరోలతో ఆన్ స్క్రీన్ ఓవర్ రొమాన్స్ చేయడానికి ఆమె ఒప్పుకునేవారు కాదు. ముద్దు సీన్ల విషయంలో కూడా హద్దుల్లో ఉండేవారు. కానీ 1989లో విడుదలైన గురు సినిమా షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆమె అనుమతి లేకుండా ముద్దు సీన్ సినిమాలోకి వచ్చి చేరింది.
ముద్దు సీన్ విషయంలో వివాదం..
గురు సినిమాలో హీరోగా మిథున్ చక్రవర్తి నటించారు. ఆయనతో ఒక కిస్సింగ్ సీన్ చేయాలని దర్శకుడు ఉమేష్ మెహ్రా శ్రీదేవిని కోరారు. అయితే, తనకు పరిచయం లేని వ్యక్తితో అలాంటి సన్నివేశంలో నటించలేనని శ్రీదేవి డైరెక్టర్ తో చాలా మర్యాదపూర్వకంగా చెప్పేసింది. అంతే కాదు ఆమె నిర్ణయాన్ని హీరో మిథున్ చక్రవర్తి కూడా గౌరవించారు. కానీ దర్శకుడు మాత్రం ఆ సీన్ ఉండాల్సిందే అని పట్టుపట్టారట.
శ్రీదేవికి చెప్పుకుండా మోసం చేసిన దర్శకుడు..
శ్రీదేవి ముద్దు సీన్ కు ఓప్పుకోపోవడంతో.. దర్శకుడు ఉమేష్ మెహ్రా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రీదేవికి తెలియకుండా ఒక బాడీ డబుల్‌ను ఉపయోగించి ఆ కిస్సింగ్ సీన్ ను షూట్ చేశారు. ఆ బిట్ ను సినిమాలో చేర్చారు. అంతేకాకుండా, ఆ సన్నివేశంలో తానే నటించానని శ్రీదేవి చెప్పారన్న ప్రచారం కూడార చేయించారట. ఈ విషయం శ్రీదేవి వరకు వెళ్లడంతో వివాదం మరింత పెద్దదయ్యింది.
కోర్డు వరకూ వెళ్లిన వ్యవహారం..
సినిమా విడుదలకు ముందు ఈ విషయం తెలిసి శ్రీదేవి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఉమేష్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ, వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లాయర్‌గా ఉన్న శ్రీదేవి తండ్రి ఈ ఘటనపై చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధమయ్యారు. ఈ వివాదం కారణంగా సినిమా విడుదల కూడా లేట్ అయ్యింది. వివాదం మరింతగా ముదురుతుండటంతో.. దర్శకుడు ఉమేష్ సదరు ముద్దు సన్నివేశాన్ని తీసేయించారని తెలుస్తోంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ ..
ఈ విషయాలను గతంలో ఒక సందర్భంలో గుర్తు చేసుకున్న శ్రీదేవి, ఇది తన సినీ జీవితంలో ఒక పీడకలగా నిలిచిందని అన్నారు. తనకెరీర్ మొత్తం మీద అత్యంత చెత్త అనుభవం ఆ సినిమా వల్ల కలిగిందని శ్రీదేవి తెలిపారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీదేవి, బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. 54 ఏళ్ల వయసులు శ్రీదేవి అనుమానస్పద పరిస్థితుల్లో మరణించింది. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది.

